ఒక జీవితం
జీవితం అంటే.. చాలా అనుభవాల సమాహారం. నా దృష్టిలో కొందరు అనుకున్నంతగా మరీ లోతైనది కాదు.. ఇంకొందరు అనుకున్నట్టు మరీ తేలికైనది కాదు. ప్రతి మనిషి తప్పనిసరిగా అనుభవించాల్సింది అంతే..! ఇలా ఎందుకంటున్నానంటే.. సమాజంలో మనకు సక్రమంగా కనబడుతున్నావేవీ.. సక్రమం కాదు. అక్రమంగా కనిపించేవి అక్రమం కాదు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే….. ప్రేమ, పెళ్లి.
చాలామంది తమ ఇళ్లలోని ఇష్టంలేని పెళ్లితో రాజీ పడి.. తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ కాపురం చేసేస్తుంటారు. బయటకు వాళ్లు మాత్రం ఆదర్శ దంపతులుగా ఈ సొసైటీ కీర్తిస్తుంది. అక్రమ సంబంధాలుగా కనిపించే చాలామందిలో నిజమైన ప్రేమ.. సజీవంగా ఉంటుంది. కానీ అది సొసైటీలో అక్రమమే. ఇలా ఉండడానికి చాలా కారణాలున్నాయి. జీవితంలో వారికున్న పరిస్థితులను బట్టి.. మనుషులు వారిదైన పరిష్కారాలు వెదుక్కుంటారు. వాటిని అనుసరించలేం.. అంగీకరించలేం.. ఆమోదించనులేం. ఇలా చాలామంది జీవితాలున్నాయి.
అందుకే ఒకరి జీవితాన్ని చూసి.. మన జీవితాన్ని అంచనా ఈ జీవితం మనకు వ్యక్తిత్వాన్ని మలుచుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తుందనేది నా బలమైన అభిప్రాయం. మనకెదురైన అనుభవాలను మనం ఎంత గాఢంగా, ఎంత పాజటివ్‌గా తీసుకుంటాం అనేదాని బట్టి మన వ్యక్తిత్వం రూపొందుతుంది. నాకు అలా జీవితంలో ఎదురైనా ప్రతి సంఘటన.. నా వ్యక్తిత్వాన్ని మలుచుకునే గొప్ప అస్త్రాలయ్యాయి.
ఈరోజు నేను చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నాను. నాలో ఉన్నది అహంకారం కాదు.. ఆత్మవిశ్వాసం అని చాలామందికి తెలిసింది. ఒకప్పుడు నా కన్నీళ్లన్నీ నాకు కొన్ని పాఠాలు నేర్పించి వెళ్లాయి. ఆ పాఠాలు.. నాకో క్యారక్టర్‌నిచ్చాయి. ఈరోజు ఎదుట వారి కన్నీళ్ల వెనుకున్న జీవితాన్ని దర్శించేలా చేశాయి. జీవితం నాకో గొప్ప వ్యక్తిత్వాన్ని ఇచ్చింది.. నా క్యారక్టర్‌కి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను. ఇంతకన్న గొప్ప అనుభూతి నాకు ఇంకేం కావాలి. అందుకే జీవితాన్ని సహజంగా అనుభవించడం.. వాటి నుంచి నేర్చుకోవడం మన పని.
– భరద్వాజ్