జీవితమంటే
జీవితమంటే మనం బతకడమే కాదు
ఇతరుల కోసమే బతకడం గొప్ప…
ఒక సమస్య నుండి మరొక సమస్యకు
ప్రయాణం చేస్తూ ఉంటాము
సమస్యలు లేని జీవితం అసలు ఉండదు..
ఎంతటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది
జీవితంలో సమయం ఎంతో విలువైనది
ప్రతి నిమిషాన్ని వృధాగా ఖర్చు చేయకండి…
సంతోషానికి పొంగుపోకు ,
దుఃఖానికి క్రుంగిపోకు ,
కష్టానికి వంగపోకు ,
కన్నీళ్లుకు కరిగపోకు ,
బంధాలను మరవపోకు ,
భయానికి బెదరిపోకు ,
అందరిని నమ్మపోకు ,
ఎవరికి లోంగిపోకు ,
మనుషులను ప్రేమించు
వస్తువులను వాడుకో
మనం అజ్ఞానంలో ఉంటూ మనుషులను వాడుకుంటున్నాము…
జీవితమంటే కళ్ళకి నచ్చితే చేతికి రాదు
మనసుకు నచ్చితే మన జీవితంలో ఉండదు…
మనుషులకు దూరమైన కొందరు
మనసుకు దూరమైన మరికొందరు..
జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎప్పుడు
మిస్ అవకండి..
మన జీవితంలో రేపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి…
జీవితమంటే ఎప్పుడు చదవాల్సిన పుస్తకం
అది మాత్రం మర్చిపోవద్దు…
- మాధవి కాళ్ల