పోలిక
ఎగిరే పక్షికి ఆంక్షలు లేవు
ఎదిగే మనిషిపై నిఘా ఉంటుంది
పక్షి తిండిపై అభ్యంతరం ఉండదు
తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని మనిషిపై సందేహం ఉంటుంది
సంచార జీవనమే పక్షికి తెలుసు
స్థిరజీవనంతో కూడబెట్టడమే మనిషికి పని
పక్షి తన పిల్లలకు స్వేచ్ఛను నేర్పుతుంది
మనిషి తన సంతానానికి భయం నేర్పుతాడు
పక్షి స్వేచ్చను చూసి మనిషి అసూయపడుతుంటాడు
మనిషి స్వార్థానికి పక్షి కలవరపడుతుంది
పక్షికి కుత్సితాలు తెలీవు
మనిషికి మనిషిగా ఉండటం తెలియదు
– సి.యస్.రాంబాబు