నీతి కథలు-1

నీతి కథలు-1

అరుణ కవిత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ మంచిగా చదువుకొని ఇద్దరికీ వేరే వేరే చోట జాబులు దొరికాయి. అరుణ విజయవాడ, కవిత కాకినాడ వెళ్లిపోయారు ఇద్దరి మధ్యలో ఫోన్ల ద్వారా మంచి చెడులు తెలుసుకునేవారు కొద్ది రోజులు గడిచాయి.

అయితే అరుణకి ఆడపిల్ల పుట్టింది అని తెలుసుకున్న కవిత తనకు మగ పిల్లాడు పుట్టాడు అని అరుణకు చెప్పింది కవిత ఫోన్ లో. వాళ్లిద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు లేవు అరుణ భర్త గురించి కవితకు అన్ని విషయాలు చెప్పేది కవిత తన భర్త గురించి అరుణ కు అన్ని విషయాలు చెప్పేది.

నిజానికి వాళ్ళిద్దరికీ మంచి భర్తలే దొరికారు. అరుణ కవిత భర్తతో అన్నయ్య అంటూ మంచిగా మాట్లాడేది. కవిత కూడా అన్నయ్య అంటే అన్ని విషయాలు మాట్లాడేది. అరుణ భర్తతో వారి భర్తలు ఒరేయ్ బావ అంటే ఒరేయ్ బావ అంటూ మాట్లాడుకునే వారు.

ఒకరోజు అనుకోకుండా అరుణ వాళ్లకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయిందని కవిత వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు కవిత చాలా సంతోషించింది తన చిన్ననాటి ఫ్రెండ్ తన ఊరికి రావడం మంచిదే అయింది అని అనుకుంది. ఈ వారంలో మేము వస్తున్నాము అంటూ మంచి ఇల్లు చూడమని చెప్పారు భార్యాభర్తలు.

వాళ్ళ ఇంటి నుండి కొద్ది దూరంలో వాళ్లకు మంచి ఇల్లు దొరికింది. ఆ ఇంటిని చూసిన అరుణ చాలా సంతోషించింది సామాను తో పాటు అంతా కొత్త ఇంట్లో దిగారు అరుణ వాళ్ళు.

ఆ రోజు కవిత వాళ్ళు అరుణ వాళ్లింట్లోనే భోజనం చేశారు సాయంత్రం వరకు ఉండి వాళ్ల ఇంటికి వెళ్ళిపోయారు. దగ్గర దగ్గరగా ఉన్న ఇల్లు ఇంటి ముందు నిలబడి చూస్తే నాలుగిళ్ళ అవతల కవిత వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. ఏ అవసరం ఉన్నా కవిత అని పిలవగానే ఇంటి ముందుకు వచ్చేది.

అయితే పిల్లలను కవిత తన బాబు చదివే స్కూల్లో అరుణ పాపను కూడా వేశారు. ఇంటి ముందుకే బస్సు వచ్చేది. బస్సు రాగానే అరుణ కవిత వారి పిల్లలను బస్సులో పంపించేవారు ఆ స్కూలు చాలా మంచిదని పేరున్న స్కూల్ అని మా బాబును చేర్పించాం అంది కవిత.

కవిత మాటలు వింటూ అరుణ కూడా వైష్ణవిని కూడా అదే స్కూల్లో చేర్పించింది. వాళ్ళ పిల్లలు వెళ్ళాక కవిత తను ఇద్దరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్నారు.

అరుణ భర్త ప్రసాద్, కవిత భర్త శివ ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అరుణ భర్త ప్రసాద్, కవిత భర్త శివ ఇద్దరూ కలసి ఒకే బండి మీద ఆఫీస్ కు వెళ్లేవారు. వారు ఇంకా మంచి స్నేహితులుగా మారారు వారి పిల్లలు కూడా మంచి స్నేహితులయ్యారు.

ఇలా ఉండగా కొద్ది రోజుల తర్వాత ఒకరోజు అనుకోకుండా స్కూల్లో కరెంటు స్తంభం వైష్ణవి పై పడబోయింది. వైష్ణవి ఆ స్తంభం కింద నిలబడి ఉంది. కిషోర్  వైష్ణవి ని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడే నిలబడ్డది అక్కడ ఉన్న స్తంభం చాలా పాతది అటూ ఇటూ ఊగుతుంది. అది కింద పడేలా ఉంది.

కిషోర్ వైష్ణవి ఎంత పిలిచినా తన దిక్కు చూడట్లేదు. బుక్కు తీసుకొని చదువుతూ ఎవరి మాటలు పట్టించుకోకుండా అలాగే నిలబడి ఉంది వైష్ణవి. ఇంతలో స్థంభం కిందకు జారుతుంది. అది చూసిన కిషోర్ బుక్స్ బ్యాగ్ కింద పడవేసి పరుగెత్తి వైష్ణవి గట్టిగా పట్టుకుని పక్కకు తోసాడు అనుకోకుండా వైష్ణవి దూరంగా వెళ్లి పడింది.

కిషోర్ కాలు మీద ఆ స్తంభం విరిగిపడిపడింది. కిషోర్ లేవాలని ఎంత ప్రయత్నం చేసినా లేవ లేక పోతున్నాడు. ఇదంతా చూస్తున్న టీచర్స్ అందరూ పరుగెత్తి వచ్చి ఆ పిల్ల వాడి కాళ్ళ మీద నుండి ఆ స్తంభాన్ని అందరు కలిసి పక్కకు తోసారు. వైష్ణవి వెళ్లి చాలా దూరంలో పడింది.

అక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి. అవి అన్ని వైష్ణవికి గుచ్చుకున్నాయి కాళ్లకు చేతులకు గుచ్చుకున్న ముళ్ళను కొంతమంది టీచర్స్ వైష్ణవిని ఆ ముళ్ళ నుండి బయటకు తీశారు. అరుణకు కవితకు ఒకేసారి ఫోన్స్ రావడంతో ఇద్దరూ ఇంటికి తాళం వేసి పరుగుపరుగున స్కూల్ కి వెళ్ళారు.

వాళ్ళ పిల్లల పరిస్థితి చూసి చాలా ఏడ్చారు మీ పిల్లలని ఇంటికి తీసుకువెళ్లి డాక్టర్ కి చూపించండి అంటూ పంపించారు టీచర్ లు. వారిద్దరూ ఆటో మాట్లాడుకుని హాస్పిటల్కి వెళ్లారు పిల్లలిద్దరినీ తీసుకొని…. ఇంతలో భర్తలకి ఫోన్లు చేసి రమ్మని చెప్పారు వారు కూడా తొందరగా వచ్చారు హాస్పిటల్ కి.

డాక్టర్ పిల్లల ని చూస్తూ వైష్ణవి ఎక్కడెక్కడ ముళ్ళు గుచ్చుకున్నాయో అవి తీయడం ప్రారంభించారు. కొద్దిపాటి లోనే ఇద్దరికీ ప్రమాదం తప్పింది అంటూ చెప్పిన డాక్టర్ కి నమస్కరించి బాబు కాలు ఎలా ఉంది? వాడు నడవగలుగుతాడా అంటూ ఏడుస్తూ అడిగింది కవిత.

పరవాలేదు అమ్మా రెండు మూడు రోజుల్లో బాబు నడవ గలడు ఏమి కాలేదు కోర్సుకు పోయింది కొద్దిగా రక్తం కారింది నేను కట్ట పెడతాను మూడు రోజులకు ఒకసారి తీసుకు రండి అప్పుడు చూసి చెబుతాను అన్నాడు డాక్టర్ కొన్ని మందులు కూడా ఇచ్చారు అది ఎలా వాడాలో చెప్పారు నలుగురు పిల్లలను తీసుకొని రెండు ఆటోలో ఇంటికి బయలుదేరారు కవిత వాళ్ళ ఇంటికివెళ్ళారు.

అరుణ ఇంటికి వెళ్ళారు పిల్లలను వదలకుండా ఎటు వెళ్లకుండా ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నారు. అరుణ కవిత అప్పుడప్పుడు కవిత భర్త ప్రసాద్ ఇంటికి వెళ్లి చూసి వస్తున్నాడు వైష్ణవి ని. కవిత భర్త కూడా కిషోర్ కూడా చూసి వస్తున్నాడు వారిద్దరూ పిల్లలు బాగా అయ్యేదాక జాగ్రత్తగా చూసుకునే వారు.

తల్లిదండ్రులు పిల్లలు మంచిగా అవగానే పరీక్షలు ఉన్నాయి అంటూ వాళ్ళ టీచర్స్ ఫోన్ చేశారు. ఇంటి ముందుకు బస్సు రాగానే పిల్లల్ని పంపించారు జాగ్రత్తలు చెప్పి. అయితే ఆ రోజు పరీక్షలు అన్నీ అయిపోయాక పిల్లల పేరెంట్స్ ను పిలిపించి స్కూల్ లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్లకు రిపోర్ట్స్ ఇస్తున్నా మంటూ తల్లిదండ్రులను స్కూలుకు రప్పించారు.

పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఒక్కొక్కరినీ పిలుచుకుంటూ స్టేజి పైకి వారి వారి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత లో వైష్ణవిని, కిరణ్ ని పిలిచారు. ఇద్దరూ స్టేజి పైకి వెళ్లారు అంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. వీరిద్దరికీ చాలా మంచి మార్కులు వచ్చాయి ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవం ఉన్నాయి.

టీచర్స్ తో కూడా గౌరవంగా మర్యాదగా ఉంటారు ఒకరిని ఒకరు రక్షించుకున్నారు ఇంకో ఇంకో ఇంకొకరు అయితే మాకేంటి అని ఊరుకునేవారు చూడండి పిల్లలు మీరంతా వైష్ణవి కిరణ్ లాగ ఉండాలి.

ఒకరికి ఒకరు సహాయం చేయాలి వాళ్లను చూసి మీరు నేర్చుకోండి అంటూ వారికి మంచి బహుమతులు ఇచ్చి పిల్లలిద్దర్నీ మెచ్చుకొని టీచర్స్ అంతా ఫోటో దిగారు.

వాళ్ళ తో పాటు వాళ్ళ అమ్మా నాన్నలను కూడా ఫోటో దించుకున్నారు సంతోషంగా ఇంటికి వెళ్లారు అందరూ. తెల్లవారి పేపర్లో వాళ్ల ఫ్యామిలీ తో పాటు ఇద్దరు పిల్లల ఫోటోలు కూడా వచ్చాయి. అది చూసి చాలామంది ఇంటికి వచ్చి వాళ్ళను పిల్లలను మెచ్చుకున్నారు.

ఇది విన్నారా పిల్లలు మనము ఇతరులకు సహాయం చేయాలి కానీ వారికి చెడు చేయకూడదు ఈ కథలోని నీతి ఇదే ముగిసింది కథ.

– కే. శారద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *