ఆయువుల పేటిక!!
జీవనదులను
చేయుచుంటువి,
నిర్జీవము…….!
నీ,
తీరని దప్పిక,
శాపమాయె వాటికి.
మూగజీవాల
మరణ రోదన,
రక్తాశ్రువులను
చిందించగ,
నీ ఆయుష్షు పెరగ,
నీ పాటికి,
నీవు వాటిని
పీక్కు తింటివి…….!
వాటి మానాన
అవి గుబురుగ పెరిగె…!
గుబులు నిన్ను
గుచ్చుతుండగ,
అడవి తల్లి గుండెన
గునపాలు గుచ్చి,
నీ గూడును గగనానికి లేపితివి …..!
గగనానికి చేరనింత
ఆత్రుత యేల……………..?
కుళ్ళు, కుశ్చితాల
చెత్తబుట్ట నీ బుర్ర.
అంటువ్యాధులను పెంచి,
ఆయుష్షులను తీసి,
పేటిక లందు భద్రపరిచెదవు….!
ఇక,
నీకు రాదు బుద్ధి చచ్చినా ……..!
– వాసు