‘నీ’ దే గుర్తింపు
నీ కట్టుబాట్లు చూస్తే,
నీ మాతృభూమి గుర్తుకురావాలి.
నీ మాట వినిపిస్తే,
నీ మాతృభాష తెలుసుకోవాలి.
నీ పలకరింపుతో,
నీ తల్లిదండ్రుల
సంస్కారం గుర్తించాలి.
నీ తెలివి తేటలు చూసి,
నీ గురువులను పొగడాలి.
నీ అలవాట్లు, లక్షణాలలో
నీ వ్యక్తిత్వం కనిపించాలి.
– రాధికా.బడేటి