కౌగిలి
మిద్దెలు మేడలు లేకున్నా
నీ నులి వెచ్చని కౌగిలి చాలు
అన్నది ఒక నెచ్చెలి
హృదయపు వాకిలిలో
పరచుకున్న పచ్చని పైరు లాంటి ఒక అనుభూతి
హృదయ స్పందనల
అందమైన అల కౌగిలి
నీ బాధను ఓదార్చే ఇంకొక
హృదయమే ఓదార్పు కౌగిలి
నిన్నుచూసి పులకించే ఆ
ఎదయే ఆత్మీయ కౌగిలి
నే ప్రయాణపు క్షేమం కోరేది
ఆశీస్సుల కౌగిలి
నువ్వే ప్రాణమని నమ్మేదిఅనుబందపు కౌగిలి
నా కళ్ళని నేనే నమ్మలేని
సందర్భం ఆశర్యపు కౌగిలి
నీవే గొప్ప అని అన్నది ఒక మమత అభినందన కౌగిలి
నే కొరకై వేచి చూసి ఎదురైంది ఆహ్వనపు కౌగిలి
నిన్ను నిన్నులా మైమరిపించే ఒకే ఒక్కటి
నీ హృదయపు కౌగిలి స్పందన .
– జి.జయ