మానవజన్మ
మా, నవ అంటె కొత్తది కాదని
ఆధ్యాత్మిక వేత్తలు నుడివె రెపుడొ
బ్రహ్మ సృస్థి చేసే సకల జీవరాసుల
సృష్టించె మానవుల భిన్నరూపమున
కొన్ని మార్పులు చేసి రెండుగా విభజించి
సృష్టి చేయుడని వదలిపెట్టె
కొంత జ్ఞానమిచ్చి,నింపుచుండ మనె
పొట్ట చేతనిచ్చి ఆకలిని నింపి
పొట్ట చేతపట్టి తిరుగుచుండె మనిషి
పొట్టనింపుకొని ఆకలిని చంప
ఆకులు అలములు తిన ఆకలి చావదాయె
ఇతర జీవరాసిని పీక్కుతింటుండె
నిప్పు కనిపెట్టె జ్ఞానం పెంచుకొని
రుచి మరిగి జంతువుల కాల్చి తింటుండె
మానవ మేధస్సు ఇంతింత పెరిగి అంతెంతై
చంద్రమండలాన కాలూనె, నెపుడొ
ప్రపంచమంతను సాలె గూడువలె మార్చి
అరచేతి యంత్రమున చూపించు చుండె
దారి తెలియక తాను తచ్చాడకుండా
దారులు ముందుగ చెప్పు జీపీయస్ కనిపెట్టె
భగవంతుడే వీరి జ్ఞానమును పెంచి ఇవి చేయుచుండ
తన ఉనికిని మరచి మానవులు ప్రవర్తించు చుండె
తన ఉనికిని చాట మానవునియందు
భగవంతుడెత్తె ఎన్నో అవతారాలు
త్రేతాయుగమున రామునిగాను,
ద్వాపరమున కృష్ణునిగా!
కలిలో ఏసు, బుద్ధుడు,అల్లా
జొరాష్ట్ర,మహవీరునిగా!
ఏడు కొండల వెంకటేశ్వరునిగా, రామకృష్ణ
పరమహంసగా,రమణునిగా,
షిర్డీ,సత్యసాయునిగా!
ఓ!మానవా! నీ ఆలోచన మానవా
ఆ,ఆది శక్తిని తెలుసుకొనవా!
– రమణ బొమ్మకంటి