కన్న కలలు
కలలన్న నిద్రలో
వచ్చునవి కొన్ని
మంచి కలయైన
ఉల్లాస పడు మనసు
చెడ్డదైన అది
కలత చెందు
ఊహల లోకములో
కదలాడు కలలు మరి కొన్ని
ప్రియుడు ప్రేయసికై కనును కల
ప్రియునికై ప్రేయసి కను కల
చిన్నవారు గొప్ప వారుగ ఎదగ
గొప్పవారై ఎదగ నింకింక
కనుచుందురు కలలు
అవి పండు వరకు.
పిల్లల గొప్పవారిగ
చేయ తలిదండ్రులు కను కల
వారి ఆ,కల నెలవేర్చ
కందురు పిల్లలు కల
కలల లోకముల నెపుడు
విహరించు చుండ
సోమరులై పోవు
ఇలలోన జనులు
వర్తమానమందు
జీవించుట మాని
భవిష్యత్ గూర్చి
కలలు కనుట మాను
– రమణ బొమ్మకంటి