గుణం
మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయి బాధపడే రోజు మాత్రం రాదు రానివ్వరు.
వెనక్కి వెళ్లి మన గతాన్ని మార్చుకోలేక పోవచ్చు కానీ ముందుకు వెళ్లి మన భవిష్యత్తు మార్చుకోవచ్చు. ఇతరులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. రెండూ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి.
– సూర్యక్షరాలు