సాయి చరితము
పల్లవి
నీవే నా దైవమని
హృదయం నిను పిలిచెనని
తనువేమో కదిలెనని
చెప్పలేను సాయి..మది దాచలేను సాయి..
చరణం
నిన్ను చూడ ఉండలేక
మనసే ఇక మధనపడి
నా అడుగే నీదనుచు
నిన్ను పిలిచె సాయి..ఇక మమ్ము వీడకోయి
చరణం
కోరికలకు కోతపడగ
అణువణువు అమ్మ ఒడిగ
మార్చినావు మా హృదిని
ఇక చేరినాము నీ దరిని
చరణం
దారంతా నీ నామము
స్మరియించిన వారమయ్య
కల్లోల జగతిలో నీ తలపే మాకు జయం
అది తెలిసిన వారికేమో ఉండదు ఏ సందేహం
– సి.యస్.రాంబాబు