యోధ ఎపిసోడ్ 4

యోధ ఎపిసోడ్ 4

తనను అలా చూస్తూ తనకు తానే ఏమారిపోయిన అవేష్ తో

“తిందరపడకురా సుంధరవధనా…..! నువ్వేం ఏం చేసావో, ఎవరిరేవరికి అన్యాయం చేశావో ఇప్పుడే తేలుస్తాగా”

అంటూ తన అరచేతిని అవేష్ గుండెలపై నుండి రొమాంటిక్ గా పైకి పోనిస్తూ తన మేడ, దానిపైనా గెడ్డం, పెదవుల గుండా ముక్కు, చెంపలను నిమురుతూ, తన రెండు కళ్లను మూయించి, తన నుదుటి పై, లక్ష్మి బ్రోటన వేలితో గట్టిగా నొక్కి తనని గతంలోకి తీసుకెళ్లిపోతుంది. అంటే అవేశ్ ని హిప్నాటిజం చేస్తుంది.

**********

అవి అవేశ్… డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు.

పద్మ. ఓ పేదింటి పిల్ల. చాలా మంచమ్మాయి. చదువులో కూడా చాలా బాగా రాణిస్తుంది. ఎవరి జోలికి వెళ్ళని తత్వం. అవేశ్ తో పాటే డిగ్రీ అదే సంవత్సరం తను కూడా అదే కాలేజ్ లో డిగ్రీలో జాయిన్ అయ్యింది. వాళ్ళ క్లాస్ లోనే చాలా అందమైన, తెలివైన అమ్మాయి తను. అప్పటికే, తన వెనుక ప్రేమ పేరుతో చాలా మందే తన వెనుక పడ్డా…

తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వాళ్ళని ఒక గొప్ప స్థితిలో నిలపాలనే లక్ష్యంతో అలాంటి వారికి దూరంగా ఉంటూ వారికి లొంగని తత్వం తనది. ఒక్క చదువు తప్ప, ఇంకో ధ్యాస లేని అమ్మాయి.

అవేశ్. ఒక ఉన్నత కుటుంబం నుండే వచ్చాడు. అసలే కామవాంఛ ఎక్కువ అతనికి. ఆ రోజు డిగ్రీలో జాయిన్ అయిన పద్మ అందాన్ని చూసిన అవేశ్, ఆ అందానికి ముగ్ధుడయ్యాడు.

తన కోరికలను ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎలాగైనా తనని అనుభవించాలనే కామకొరిక తనకి పుట్టింది. దానికి తోడు, చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అతన్ని రెచ్చగొట్టడంతో…

వెంటనే తన వద్దకు వెళ్లి, “నాతో ఒక నైట్ స్పెండ్ చేస్తావా..?” అంటూ సిగ్గులేకుండా అడుగుతాడు పద్మని తన ఫ్రెండ్స్ అందరి ముందే.

దాంతో కోపోద్రిక్తురాలైన పద్మ, అవేశ్ అన్న మాటలకు ఆవేశంగా, అదే అందరి ముందు చాచిపెట్టి గట్టిగా అవేశ్ రెండు చెంపలను చెళ్లుమనిపించింది. చుట్టూ ఉన్నవాళ్ళంతా అవేశ్ ని చూస్తూ పగలబడి నవ్వుతారు. అవేశ్ ఫ్రెండ్స్ కూడా అవేశ్ ను హేళన చేస్తారు. అవమాన భారంతో అవేశ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

తనని ఏదోకటి చెయ్యాలనే కసి అవేశ్ మదిలో మొదలవుతుంది. ఇప్పుడేం చేసినా అది తన మీదకే వస్తుందని భావించి, మూర్ఖపు నిర్ణయాలతో కాకుండా తనని తెలివిగా దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తాడు అవేశ్. 

అలాంటి ప్రణాళికలో భాగమే, పద్మ దగ్గర మంచివాడిగా నటించి, తనని ప్రేమలోకి దింపి, ఆ తర్వాత తనని లోబర్చుకోవడం. ఇదే అతని ప్లాన్. మరునాడు వెళ్లి, తను చేసిన తప్పుకు క్షమాపణలు కోరతాడు. తనని మచ్చిక చేసుకుని, తనతో చెలిమికి ప్రయత్నిస్తాడు. చివరికి తను అనుకున్నట్టుగానే, సరిగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు, పద్మ దగ్గర ఓ మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తర్వాత ప్రేమ పేరుతో తనకి గేలం వేస్తాడు. పద్మ గురించి తెలిసిందేగా, అంతకుముందు వాళ్ల లాగానే, అవేశ్ కి కూడా లొంగలేదు. తనని కూడా రిజెక్ట్ చేస్తూనే… మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అంటూ చెప్తుంది. దానికి అవేశ్ కూడా ఏమనకుండా ఒప్పుకోవడంతో తనపై, పద్మకి ఇంకాస్త మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

వాళ్ల ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ముగుస్తుందనగా కాలేజ్ యానివర్సరీ రానే వచ్చింది. ఆ రోజు నైట్ అందరూ పార్టీలో బాగా ఎంజాయ్ చేశారు. అప్పటికే బాగా లేట్ నైట్ అవ్వడంతో, పద్మ ఆ నైట్ కి వాళ్ల ఫ్రెండ్స్ రూంలో ఉందామనుకున్నా…

“మా రిలేటివ్స్ రూం పక్కనే, అక్కడైతే నీకు ఏ ఇబ్బంది ఉండదు,” అంటూ తనకి సలహా ఇస్తాడు అవేశ్.

తను అతనితో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నా కూడా..

“నువ్వు ఇప్పుడు రాకపోతే, ఇంకా నా మీద నీకు నమ్మకం లేనట్టే, ఆ రోజు జరిగింది నువ్వింకా మనసులో పెట్టుకున్నావు కదూ!” అంటూ తన గుంట నక్క తెలివి పద్మ దగ్గర చూపించాడు అవేశ్.

అసలే సున్నిత మనస్కురాలైన పద్మ, అతని మాటలకు కరిగిపోయి చివరికి అవేశ్ రిక్వెస్ట్ ని కాదనలేక ఒప్పుకుంది. అలా తనని రిలేటివ్స్ రూంకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఇల్లంతా కాళిగా ఉంది. దాంతో భయ బ్రాంతులకి గురైనా పద్మ..

“ఏంటి..? ఇక్కడ మీ రిలేటివ్స్ ఉంటారు అని చెప్పావు. ఇల్లంతా కాళిగా ఉంది.” అంటూ అవేశ్ ని ముక్కు సూటిగా ప్రశ్నించింది పద్మ.

“ఓహ్..! అదా.. నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అందరూ ఎక్కడికో వెల్లినట్టున్నారు. అయినా ఎందుకంత భయం..! నేనున్నాగా..!! ఆ చెమటలు చూడు ఎలా పడుతున్నాయో, (తుడుచుకోమన్నట్టుగా పక్కనే ఉన్న టవల్ ఇస్తూ)” అంటూ అప్పటికే భయంతో చెమటలు పట్టిన మొహాన్ని తన చేతులతో తుడుచుకుంటున్న పద్మ తో అన్నాడు అవేశ్.

“నాకెందుకో చాలా భయం వేస్తుంది. పదా వెళ్ళిపోదాం!” అంటూ పద్మ కొంచెం భీతిల్లిన స్వరంతో అంటుంటే,

“అబ్బబ్బా… నీ తెలివి చదువులోనే, బయట ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు అన్నమాట…! అయ్యో తింగరి ఎందుకంత భయం… ఉండు వాటర్ తీసుకొస్తాను” అంటూ తనని సోఫా మీద కూర్చోబెట్టి, ఆ పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్ళాడు అవేశ్.

ఈ లోపు ఆ గదినంతా తదేకంగా గమనిస్తున్న పద్మ, చుట్టూ ఎటు చూసిన శృంగారభరిత వాల్ పెయింటింగ్స్, నగ్న చిత్రాలు, చిన్న చిన్న నగ్న బొమ్మలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అవి చూసిన పద్మకు మరింతగా భయం ఎక్కువైంది.

ఈ లోపు అవేశ్ వాటర్ తీసుకు రావడంతో, వాటిని గట… గటా.. తాగేసింది ఎత్తిన నోరు దించకుండా. పాపం పద్మకి తెలీదు అప్పటికే అందులో అవేశ్ మత్తు కలిపాడని. ఆ మత్తు నీళ్ళు తాగిన పద్మ, స్పృహ కోల్పోయి పడిపోయింది.

అలా స్పృహ కోల్పోయిన పద్మను అదే అదునుగా భావించి తనను లైంగికంగా లోబర్చుకున్నాడు. విచక్షణ లేకుండా తనపై అత్యాచారం చేశాడు. తెల్లారి స్పృహలోకి వచ్చిన పద్మకి విషయం తెలిసి, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని గ్రహించి, తను ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో రోదించింది. 

పక్కనే ఉన్న అవేశ్ వెటకారంగా నవ్వుతూ…

“చూసావా..? ఆరోజు అడిగిన వెంటనే ఒప్పుకుంటే, ఈరోజు నేనింత ప్రయాస పడేవాడిని కాదు, నువ్వింత బాధ పడేదానివి కాదు అంటూ తనతో ఎగతాళిగా అంటుంటే,

అప్పటికి తన కపట బుద్ధి తెలుసుకున్న పద్మ అవేశ్ కాలర్ పట్టుకుని 

You… Cheat…

You…cheat ..

అంటూ తన రెండు చెంపలు చెళ్లుమనిపించబోతుంటే..

తన రెండు చేతులను గట్టిగా పట్టుకుని, నువ్విపుడు ఏది చేస్తే దానికి తలాడించడానికి నిన్నటి మొన్నటి అవేశ్ ని కాదే… ఒక్కప్పటి అవేశ్ నీ, పో… పోయి నీ దిక్కున్న చోట చెప్పుకో..!” అంటూ తనని పక్కకు తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవేశ్.

తను అలా అవేశ్ చేతిలో మోసపోయిన విషయం ఎక్కడైనా చెప్తే, తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఈ సమాజం తప్పుగా అనుకుంటుదేమొనని… ఒకవేళ ఎప్పటికైనా ఈ విషయం బయటకి పొక్కచ్చనే భయంతో బలవంతంగా ఆత్మహత్య చేసుకుంది పద్మ.

అంత కష్టపడి చదివించిన కూతురు, అర్ధాంతరంగా అలా బలవన్మరానికి పాల్పడడం, ఆ కేసును టేకప్ చేసిన పోలీసులు, తను నలుగురితో తిరిగి ప్రెగ్నెన్సీ రావడం, ఇంట్లో తెలిస్తే తిడతారని భయంతో చనిపోయినట్టుగా ఆ కేసుని క్లోజ్ చేస్తారు. దాంతో తమ కూతురు అలాంటిది కాదని ఎంత వారించినా… ఈ సమాజం తన మీద పదె పదే నిందలు వేయడం తట్టుకోలేని వాళ్ల తల్లిదండ్రులు కూడా కొన్నాళ్ళకి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

ఇంత జరుగుతున్నా అవేశ్ కి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని, తన కుటుంబాన్ని, అతని సరదాల కోసం నాశనం చేసిన అవెశ్ కి, అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది లేకుండా తన పని తాను చూసుకుంటాడు.”

అలా తను మర్చిపోయిన ఆ గతాన్ని, అవెశ్ కి మళ్ళీ గుర్తు చేస్తుంది లక్ష్మి.

దానికి ఆశ్చర్యపోయిన అవెశ్…

“ఇవన్నీ నీకెలా తెలుసు!” అని అంటుండగా లక్ష్మి తన రూపాన్ని మార్చుకుని, పద్మ యొక్క రూపంలోకి మారి అవేశ్ కి దర్శనమిస్తుంది. అప్పుడు అర్ధమవుతుంది అవెష్ కి, తన వల్ల చనిపోయిన పద్మ అలా ఆత్మ రూపంలో తనపై పగ తీర్చుకోవడానికి వచ్చిందని.

“నన్నేం చెయ్యొద్దు.. , నన్నేం చెయ్యొద్దు….”

అంటూ అవెష్ తనని ప్రాధేయపడుతుండగా..

“అప్పుడు నేను కూడా ఇలాగే ప్రాధేయపడ్డాను రా… నువ్వేమన్నావ్…? ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అని కదూ..! ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారో నేను చూస్తా…!

అంటూ ఒక చేతితో అవేశ్ కంఠాన్ని గట్టిగా పట్టుకుని, మరొక చేతి వేళ్ళని అవేశ్ కడుపులోకి చొప్పించి, తన ప్రేగులను బయటకి తీసి, అతి కిరాతకంగా మరింత దారుణంగా అతనిని చంపేస్తుంది. 

ఆమాయకులైన ఆడపిల్లలను కనికరం లేకుండా పొట్టన పెట్టుకున్న నీ లాంటి మృగాలందరికి, ఇదే ఈ యోధా విధించే మరణ శాసనం అంటూ అక్కడి నుండి మాయమవుతుంది ఆ ఆత్మ.

అసలింతకీ యోధ ఎవరు..?

యోధ ఆత్మ లక్ష్మీలోకి ఎందుకు ప్రవేశించింది?

ఆ ఆత్మ పద్మలా ఎలా మారింది..?

యోధ.. లక్ష్మి… పద్మ వీళ్ళందరికీ ఒకరికొరికి సంబంధమేమిటి..?

మిగిలిన వాళ్లందరినీ కూడా ఆ ఆత్మ ఇలానే చంపబోతుందా..?

(ఒకవేళ వాళ్ళు కూడా అవేశ్ చేసిన తప్పులు చేసుంటే)

ఇప్పటికే అవేశ్ చనిపోయాడు, మరి మిగిలిన వారి పరిస్థితేంటి?

వాళ్ళు బ్రతికి బయట పడగలరా..?

ఏం జరగబోతుందో తర్వాతి భాగం యోధ (ఓ ఆత్మ ఘోష) -5 లో తెలుసుకుందాం.

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *