పునర్దర్శనం
వెండి పూల వెలుగుల రేడు..
విచ్చు కత్తుల్లా విరజిమ్మే
పగలుకు వీడ్కోలు పలికి…
సంజె సోయగాల…
అరుణిమ లోంచి..
నిశీధి నీరవంలోకి..
పరివర్తనం చెందుతూ..
సవ్వడి లేకుండా….
సన్నగిల్లి పోతున్న..
ఆదిత్యుని రవికిరణాలను…
వీక్షిస్తున్న ప్రతి దినం…
ఆశ నిరాశల..
చక్ర వలయంలో నలిగి..
విసిగి వేసారిన నా మది…
ఆత్మావలోకనం చేసుకుంటుంది..
రేపటి వెలుగుల రేడు…
పునర్దర్శనం…
ఉంటుందో లేదో అని…
– మామిడాల శైలజ