విజయాల శిఖిపించమౌళి
తెలుగు సినిమా మార్కెటింగ్ పొటెన్షియల్ తెలిసిన వాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా ప్రమోషన్లు ఆయన తర్వాతే ఎవరైనా.
ఆయన కెరీర్ పరిశీలిస్తే స్టూడెంట్ నంబర్ వన్,సింహాద్రి చిత్రాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి గట్టి పునాది వేశాయి, ముఖ్యంగా సింహాద్రి. అలాగే రాంచరణ్ కెరీర్ కు మగధీర ఒక బిగ్ లీప్.
ఇప్పుడు ఈ ఇద్దరితో వస్తున్న బిగ్ లీగ్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆయన ఊహలు కూడా అనూహ్యంగా ఉంటాయి.
స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు లను కలిపితే ఎలా ఉంటుందన్న ఊహ అభినందనీయమే అయినా అది తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నాడు అన్న కుతూహలం అందరికీ ఉంది.
కానీ హిందీలో బాహుబలికి వచ్చిన క్రేజ్ కనబడటం లేదు. ఒకక్కొరికి ఒక్కో స్త్రెంత్ ఉంటుంది. టెక్నికల్ గా అత్యున్నత నైపుణ్యం,మంచి బాణీలు,నేపథ్య సంగీతం,నటీనటుల ఎంపిక రాజమౌళి ప్రత్యేకత.
పంచ్ లు ప్రత్యేకంగా కనిపించవు కానీ,ఆడియన్స్ పల్స్ తెలిసినవాడు.అందుకే ఎక్కడా ఎదురుదెబ్బలు లేవు. కథను పెద్దగా రివీల్ చేయకుండా మనకు రిలీఫ్ లేకుండా చేశాడు.
బొమ్మ బ్లాక్ బస్టర్ అనటంలో అనుమానం లేదు. ఎవరూ చేయని ప్రయోగాలు చేయటం రాజమౌళికి ఇష్టం.
టీజర్లు, ట్రైలర్లతో హోరెత్తించాడు. ఆల్రెడీ.. ఎంత నమ్మకముంటే సింపుల్ గా ఆర్.ఆర్.ఆర్.అని టైటిల్ పెట్టగలుగుతాడు అందరూ ఇక వెండితెర విన్యాసానికి ఎదురుచూద్దాం..
రివ్యూ మరి కొద్దిసేపట్లో…..
– సి.యస్.రాంబాబు