వాంఛ కానిది ప్రేమ!!
నిన్ను చేర, నేను చేసే,
ప్రయత్నాలు నిరాశలు కావులే…..!
నా హద్దులు నాకు తెలుసులే!
నా హృదయము గాయపడిన గాని,
అది నీకు కనిపించదు లే……..!
నిన్ను నొప్పించదు లే!
లోహము లాంటిదే నా హృదయం.
అది దృఢముగనే ఉండును.
నా దరికి రాదులే అలసట,
నీ ఒడిని చేర……….!
మండుచున్న నా హృదయము
ఒక కొలిమీ మాదిరి.
సమ్మెట చేయు నే నన్ను,
మరింత దృఢము చేయగ!
ఒక గోడ నిలిచెను మన ఇద్దరి మధ్య,
దాన్ని కూర్చుట పెద్ద చోద్యం కాదే…..!
నాది వాంఛ ఐన చో కూల్చుదునే దాన్ని,
కానీ, నాది అది ప్రేమనే మరి………!
– వాసు