వాగ్దానం
ఎంత సున్నితంగా ఉంటారు
ఎన్ని బాధ్యతలను మోస్తారు
జన్మనిచ్చేది మీరే
మా చేయి పట్టుకు నడిపించేది మీరే
ఆకాశంలో సగం మీరు
అవకాశాలిస్తే మొత్తం మీరే
కుటుంబాన్ని కాపాడేది మీరే
కష్టాన్ని ఇష్టంగా మార్చేది మీరే
ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు
అనుబంధాల పొదరిల్లు
ఆలోచనలో ముందుంటారు
ఆచరణలోను ముందుంటారు
ఇది కొత్తగా తెలిసిన సత్యం
ఇంటికి దీపం మీరే
మా కంటివెలుగు మీరే
మీ విజయం వెనక ఇక మేమే
ఇది మా వాగ్ధానం
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
– సి.యస్.రాంబాబు