తెగింపు సినిమా సమీక్ష
అజిత్, మంజు వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మిగతా వాళ్ల గురించి తప్ప ముగ్గురు గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను వాళ్లు హీరో హీరోయిన్స్ అలాగే సముద్ర ఖని.
సినిమా మొత్తం ఒక గ్యాంగ్ స్టర్ గురించి అయినా సమాజంలో జరిగే లోటు పాటలను అలాగే ప్రజల అమాయకత్వం గురించి దేన్నైనా నమ్మి బలి పశువుల్లా చూపిస్తూ అలాగే కొందరు తప్పని పరిస్థితులలో పై అధికారులకు లొంగిపోవడం లాంటివి ఈ సినిమాలో చూపించారు.
హీరో గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది చూపించలేదు కానీ హీరో ఒక గ్యాంగ్ స్టర్ అని సినిమా మొదట్లోనే చూపిస్తారు. అలాంటి హీరో దగ్గరికి ఒక డీల్ వస్తుంది. కానీ దానికి హీరో ఒప్పుకోడు దాంతో వాళ్ళు వేరే వాళ్ళకి అప్పగిస్తారు.
వాళ్లు ఒక పదిమంది గ్యాంగ్ కలిసి ఒక బ్యాంకు దోచుకోవాలి అందులో 500 కోట్లు ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ దాంతో ఈ దొంగలు వెళ్లి దోచుకోవడానికి ప్లాన్ వేస్తారు అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ప్లాన్ చేస్తాడు. అయితే వారి కన్నా ముందుగా హీరో అక్కడికి వెళ్లి తన ప్లాన్ ప్రకారం వారందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకొని అలాగే పోలీసులతో కూడా మాట్లాడి చివరికి వాళ్ళు దోచుకోవాల్సింది 500 కోట్లు కాదు 25,000 కోట్లు అని అతనితోటే చెప్పిస్తాడు.
అందులో ఇన్స్పెక్టర్ కి కూడా బాగం ఉందని తెలిసిన మిగతా పోలీసులు కమిషనర్ అతని అరెస్టు చేస్తారు అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం ఇది డమ్మీ బాంబు అని అక్కడికి వెళ్లి దాన్ని లాగుతాడు సమయంలో బ్లాస్ట్ ఐపోయి ఇన్స్పెక్టర్ చనిపోతాడు. ఆ తర్వాత ఇదంతా ప్లాన్ కి ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని హీరో వాళ్ళని ఇండియా రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరో కాదు ఆ బ్యాంకులో పని చేసే వాళ్లే, ఒకానొక సమయంలో హీరోని అక్కడ వారు కొట్టి బంధిస్తారు. హీరోకి బయటనుంచి హీరోయిన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ పట్టుకోవాలని వెళ్ళిన పోలీసులకి మిగిలిన ప్లాన్ చేసిన ఐదుగురు శవాలుగా కనిపిస్తారు కానీ హీరోయిన్ మాత్రం చిక్కదు.
ఇక చివరికి అసలు విలన్లు ఎవరు అసలు ఎందుకు ప్లాన్ చేశారు అనేది తెలుసుకోవడానికి కమిషనర్ తో పాటు హీరో కూడా ప్రయత్నం చేసి వాళ్ళని రప్పిస్తాడు వాళ్ళ నోటి నుంచే నిజాన్ని చేపిస్తాడు ఆ తర్వాత అందరూ డబ్బులు వెతుకుతున్న సమయంలో అక్కడ ఉన్నది నకిలీ నోట్లు అని తెలుస్తుంది. అసలు నోట్ల స్థానంలో నకిలీ నోట్లు ఎలా పెట్టావు అని అడిగితే అప్పుడు అదే బ్యాంకులో పనిచేసే ఒక వ్యక్తి ఆ 25 కోట్లు కొట్టేశాడు అంటే చైర్మన్ ఆ బ్యాంకు చైర్మన్ ఆ 25 వేల కోట్లు దాచి పెట్టాడు అనే విషయం తెలుసుకుంటారు ఆ 25 వేల కోట్లు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇక ఆ చైర్మన్ విధీలేని పరిస్థితిలో తను ఎక్కడ దాచి పెట్టాడో చెప్తాడు.
ఇక హీరో హీరోయిన్లు వెళ్లి ఆ డబ్బును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రాసెస్‌లో పోలీసులు వేరే దేశం వాళ్లు కూడా వీళ్ళనే అటాక్ చేస్తారు అయినా కూడా ప్రాణాలకు తెగించి ఆ డబ్బులు అంతా హీరో హీరోయిన్లు కలిసి కమిషనర్ కు అప్పగిస్తారు. చివరికి అందరూ హీరో చనిపోయాడు అని అనుకుంటారు కానీ హీరో మాత్రం బ్రతికే ఉంటాడు ఫోన్ చేసి కమిషనర్ కి ఆ డబ్బంతా చేర వలసిన వాళ్ళకి చేర్చు అని చెప్తాడు వాళ్లు నీకు కూడా థాంక్స్ చెప్తారు అని కమిషనర్ చెప్పడంతో కథ అక్కడితో ముగుస్తుంది.
అసలు ఈ డబ్బు ఎక్కడిది ఏంటి హీరో ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అనేది అసలు కథ దాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. అది మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది. అలాగే బ్యాంకు వ్యవస్థ మీద బ్యాంకులో జరిగే లోటుపాట్ల గురించి కూడా క్షుణ్ణంగా మనకు ఈ సినిమాలో తెలియజేశారు. అయితే ఇక్కడ పాటల గురించి చెప్పుకోవాలి పాటలు కొంచెం మనకు మంచిగా అనిపించవు ఒక్క సాంగ్ తప్ప మిగిలిన పాటలన్నీ మామూలుగానే ఉంటాయి అదొక్కటే ఒక చిన్న లోపంగా అనిపిస్తుంది.
మన దగ్గర డబ్బు ఉన్న సమయంలో బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి మా దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని మనల్ని కవ్విస్తారు మనల్ని పెట్టుబడి పెట్టేలా చేస్తారు కానీ మనం అవేవీ చూడకుండా వడ్డీ ఎక్కువగా వస్తుందని నమ్మి బ్యాంకులో పెడతాము అలా పెట్టడం మన అమాయకత్వానికి నిదర్శనం. మరి ఎలా దాచుకోవాలి బ్యాంకులో నమ్ముతాం అంటారా ఇక్కడ కొన్ని బ్యాంకులు తప్ప మిగతా బ్యాంకులు అన్నీ దివాలా తీసేవే ఉంటాయి అలా దివాలా తీసే బ్యాంకులను గుర్తించి వాటిలో పెట్టకుండా న్యాయంగా ఉండే బ్యాంకులను ఎంచుకోవాలి లేదా బంగారం కొని అయినా దాచుకోవాలి అంతే తప్ప బ్యాంకులో ఇన్వెస్ట్ చేయకూడదు అనేది నా సొంత అభిప్రాయం.
ఇక్కడ ఈ సినిమాలో ఆ రహస్యం ఏంటి అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి ఆల్రెడీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. కాబట్టి మీరందరూ ఈ సినిమా తప్పక చూడాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వాడే అసలైన దర్శకుడు అని నేను అంటాను. ఈ సినిమాలో మనం నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి. మన నీడను కూడా మనం నమ్మలేని కాలం ఇది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేయాలి అనేది నా సూచన.
ఇక నేను ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 3/5
– భవ్య చారు