“టీ” (వేడి తేనీరు)
ఒక రకపు ఆకు తిన్న నొక మేక
గంతులేసె నట ఎగిరి ఎగిరి
అబ్బురపడి ఆ కాపరి గంతులేసె నట
తనుకూడా ఆ ఆకు తిని,ఎగిరి ఎగిరి
కనుగొనె పరిశోధించె అందు
ఒక వింత శక్తిగలదని
అదే తేయాకు,మనల
ఉత్తేజపరచు వేడి వేడి “టీ”
చాయ్ పీలాతే క్యా!
చాయ్ పీయేంగే చలో!
అని స్నేహితుల పెంచు “టీ”
ఆప్యాయతని పంచును “టీ “
పూర్వమొక సినీ నటి
మీకు “టీ “ఇష్టమా! కాఫీ ఇష్టమా!
అని అడిగిన తన పేరు చెప్పిందట
టీ.ఏ.మధురం అని (నటి పేరు టీ. ఏ
మధురం )
చిన్న పార్టీలకు” టీ” పార్టి
అను పేరుతొ
కలుసుకొను చుందురు
కొందరు స్నేహాన్ని పెంచుకొన
నిత్య జీవితంలో అతి
ముఖ్య పాత్ర వేడి వేడి” టీ” ది
“టీ” తోన మొదలవ్ కొందరి
దినచర్యకూడ
పనివాడు “టీ “తాగి
పని మొదలు పెట్టు
“టీ “తాగి డ్రైవర్
బండి స్టార్ట్ చేయు
“టీ “తాగక ఉద్యోగులు
ఫైలు తెరవరు
“టీ “తాగని కొందరికి
తలనొప్పి వచ్చు
ఉత్తేజపరచు ‘టీ”
దినమంత మనల
తలచుకొందుము దినములో
పలుమార్లు “టీ” ని
– రమణ బొమ్మకంటి