తోడు- నీడ
రెండు చక్రాల బండిని
ఇరుసు వలె పట్టివుంచి
భద్రత బాగుగాను నుండి
తోడులోను
బాధ వున్న తెలియదు నీడలోను
సాక్షి వై నిలుచును తోడుగాను
సంతసించిన మది
నిండుగా ను
పెనవేసిన బంధాల
పీట ముడులు
పేగు బందాల రక్షణ లో
పేరుగాంచిన
నమ్మకాల పునాదులు
కట్టుకుంటూ
చిన్ని కలల బంగళాలు
చెప్పేను బాధ్యతలముచ్చట్లు
కలహాల లేని కాపురం
కాదులే తోడు వుండగా
అనురాగాలు
ఇష్టాలు వున్నా కష్టమని
చెప్పదు ఇల్లాలు
శాస్త్ర మేదైనా గాని
పగలు రాత్రి వలె
పయనించ వలెను
దోషాలు గుణాలు వెతికి
పెట్టుకోక తోడు లోన
సాదింపులు ఎన్ని వున్నా
సంగమమే వుండును
నీ కాదు నా కాదు
మనమే అంటుం ది మనసు నిక్కముగా
మనిషి మనిషికి తోడు
అంటూ నీడ అంటూ
సాగేను దాంపత్య జీవనం
మారని మనుష్యులు
మారే వయస్సులో తోడుగా
నీడ గా పదిలమవ్వును
అదే కదా కడదాక
నిన్ను పట్టివుంచు.
ఏ జన్మ బందమో కదా
ఇలలోన ఈ వరుస……?
– జి జయ