తల్లి తండ్రుల గొప్పతనం
తల్లితండ్రులు కనిపించే దైవాలు అంటారు కదా
ప్రేమనే పంచే పెన్నిధులు
నీతిని చెప్పే నిష్ణాతులు
మమతను పెంచే మాణిక్యాలు
స్వార్థం లేని సారథులు
సంస్కారం నేర్పే గురువులు
భరోసానిచ్చే భాగ్యులు
మన్నించే మహాత్ములు
కాపాడే కర్తవ్యులు
మాట్లాడే ప్రియ భాషకులు
సాన్నిహిత్యానికి స్నేహితులు
సంతోషం కోరే శ్రేయోభిలాషులు
అపకారం తెలియని అజ్ఞానులు
కాపాడే కరుణామూర్తులు
గెలిపించే శక్తిశాలులు
మార్గం చూపే మార్గదర్శకులు
సంస్కారం నేర్పే సాంప్రదాయకులు
మమకారపు మాధుర్యాలు
సహకరించే సన్నద్ధులు
నడవడికల జ్ఞానమూర్తులు
అర్థం చేసుకునే త్యాగమూర్తులు
సరిదిద్దే సలహాదారులు
అన్నింటిని ఇచ్చే అభయ హస్తాలు
గెలిపించే ఆరాటకులు
అనునిత్యం మన సంతోషం కోసం పరితపించే
నిత్య శ్రామికులు
వారే లోకంలో కనిపించే
ఆరాధ్యదైవాలు తల్లితండ్రులు మరి…
– జి జయ