శిల
ఆమె పాదాలు కట్టివేయబడ్డాయి
ఆమె పాదాలు సంప్రదాయ ముసుగులో
ఆచార వ్యవహారాలను చూపుతూ ఆమె పాదాలు
కట్యివేయ బడ్డాయి. బయటకు రానివ్వకుండా
స్వతంత్రంగా బ్రతకకుండా, స్వేచ్చ అనే పదానికి
అర్థం తెలియకుండా నాలుగు గోడల నడుమ
కుటుంబ బాధ్యతలు అనే సుడిగుండంలో
వంట అనే పనిమనిషి హోదాలో లేదా ఇంటి పేరుకి మాత్రం
యజమానిగా చూపుతూ, బాధ్యతలను పంచుకోమంటూ
కుటుంబ వ్యవస్థను కాపాడమంటూ నువ్వు ఏం చేసినా అది
మన వంశానికే మచ్చ అని నూరి పోస్తూ, చిన్నప్పటి నుండి
ఆమెను ఆలోచించ నివ్వకుండా, తప్పుడు ఆలోచనలు చేస్తే
పాపం తగులుతుంది అని చెప్తూ ఆమె పాదాలకు సంకెళ్లు వేశారు.
అది నిజమే నేమో అనుకుంటూ ఆమె కూడా తనను తన వ్యక్తత్వాన్ని మరిచి, తన స్వేచ్ఛను హరిస్తున్నరని తెలియని
పిచ్చితనంతో ఆమె బానిసగా అయ్యింది.
కాదు బాధ్యత అనుకుందా పిచ్చిది. అందుకే ఆ సంకెళ్లు తెంచుకుని బయటకు రాలేక లోలోపలే మగ్గిపోతోంది శిలయై….
– భవ్య చారు