శక్తి

 శక్తి

అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నా,
ప్రతి రూపంలో దుష్టులను శిక్షిస్తూ ,
తన శక్తిని ప్రపంచానికి చాటుతూ,
నమ్ముకున్న వారిని కరుణిస్తూ ,
ప్రతి స్త్రీకి తన శక్తినిస్తూ ,
ఇప్పుడు ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు స్త్రీ ఉగ్రరూపం దాలుస్తూ ,
తనపై జరిగే ఆకృత్యాలకు  ప్రతిస్పందిస్తూ ,
మహోత్ కృష్ణమైన స్త్రీ శక్తిగా నిలుస్తూ ,
ఇల్లుపాదిని సంతోష పెడుతూ ,
తనకంటూ ఒక పేరుని ఏర్పరుచుకుంటూ ,
అందరూ తనవాళ్లే అని అనుకుంటూ ,
స్త్రీ శాంతి , సహనాలతో ఉంటూ ,
ఆత్మవిశ్వాసంతో ఆశయం కోసం ముందుకు అడుగులు వేస్తూ ,
స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి నిరూపించడానికి తను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ,
తనకంటూ ఒక గుర్తింపు పొందాలని ఆరాటపడుతూ ,
ఇతరులు తనని అవమానించిన కింద పడకుండా ,
మళ్ళీ లేచి తన కాళ్ళ మీద నిలబడింది..
తనని అవమానించే వాళ్లతోనే జేజేలు పలికేలా చేసింది..
ప్రతి స్త్రీ ఒక శక్తి ,
ఆ శక్తిని ప్రతి స్త్రీ తెలుసుకొని ,
ముందు జాగ్రత్తతో మెలగాలి…

 

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *