ప్రకృతి మాత

ప్రకృతి మాత

స్త్రీ అంటే ప్రకృతి శ్రీ సృష్టికి మూలం అఖిలాండకోటి బ్రహ్మాండంలో అంతర్లీనంగా పరివ్యాప్తమై ఉంటుంది స్త్రీ మూర్తి. సృష్టి ఆరంభం నుంచి స్త్రీని గౌరవనీయమైన స్థానంలో పూజ్యనీయురాలుగా చూసారు.

ప్రాచీన గ్రంథమైన ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా స్త్రీని అభివర్ణించారు త్రిగుణాల సమాహారంగా ప్రకృతికి ప్రతీకగా అందులో స్త్రీని పేర్కొన్నారు.త్రి గుణాలు అంటే సత్వ,తమో, రజోగుణాలు.

సమాజంలో స్త్రీని స్థానాన్ని మానవజాతికే తొలి విజ్ఞానమైన ఋగ్వేదం. “తజ్జాయా జాయ భవతి యుద్ధ స్వాo జాయతే పునః” అంటూ పురుషుడు స్వయంగా స్త్రీ గర్భం నుండి పురుష రూపంలో జన్మిస్తాడని స్త్రీ వలన ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పడం జరిగింది.

వేద కాలంలో స్త్రీలంటే పూజ్యనీయ భావం ఉంది. స్త్రీ సమాజానికి సూర్యకాంతి వంటిది తమ విద్యా శోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దీ స్త్రీకి మాత్రమే సాధ్యపడుతుందని స్త్రీ వలన భావితరాలకు రక్షణ, శిక్షణ ఉంటుందని పేర్కొనడం జరిగింది.

తర్వాత మనస్మృతిలో న్యాయ స్వరూపమే స్త్రీ అన్నారు ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో ఉత్తమ సంతానం కలిగి తద్వారా ఉత్తమ సమాజం రూపొందుతుందని చెప్పబడింది.

కాలాలు గడుస్తున్న కొద్దీ,తరాలు మారుతున్న కొద్ది స్త్రీ స్థానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుని వారు సమాజంలో గౌరవం లేని వ్యక్తులుగా పరిణామం చెంది.

వంటింటి కుందేల్లలాగా, పురుష జాతికి ఆనందాన్ని ఇచ్చే సాధనాలుగా, విద్యకు అనర్హులైన వ్యక్తులుగా భావించబడి పురుషాధిక్య భావజాలం పేట్రేగిపోయి.

ఒకప్పుడు పూజింపబడిన స్త్రీ జాతే అనేక రకాల ఆంక్షలతో బందీ చేయబడి, బలిపశువుగా బతుకే భారమైన పరిస్థితిలో ఆధునిక జనారణ్యంలో దారి తెన్నులేని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

తను మరణయాతన పొంది పునర్జన్మ ఎత్తి, జాతి మొత్తానికి జన్మనిచ్చి సకల సేవలు అందిస్తూ సృష్టిని సుస్థిరం చేస్తున్న స్త్రీకి పితృస్వామ్య ఆధిక్యత గల సమాజం ఇస్తున్న సముచిత గౌరవం ఇది..

-మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *