రెడ్ లైట్ ఏరియా

రెడ్ లైట్ ఏరియా

ఆదరా బాధరగా పరెత్తుతూ వచ్చింది లలిత రైల్వే స్టేషన్ కి, స్టేషన్ కి రాగానే, గట్టిగా నిట్టూర్చి, చుట్టూ చూసి, తనని ఎవరు గమనించడం లేదని అనుకుని, బరువుగా ఉన్న బ్యాగ్ ని ఒక దగ్గర పెట్టి, దాని పక్కనే కూర్చింది. ప్రవీణ్ కోసం ఎదురు చూస్తూ….

అబ్బా ఇంకా రాడేంటి అసలు ట్రైన్ వచ్చే సమయం కూడా అయ్యింది. అని అనుకొని చుట్టూ చూసింది ఇంతలో ప్రవీన్ వస్తూ కనిపించాడు. అతని చేతిలో ఒక చిన్న బ్యాగ్ మాత్రమే ఉంది. అది చూసి లలిత ఆశ్చర్యపోయింది.

హమ్మయ్య ఎలాగూ వచ్చాడు అని అనుకొని, ఏంటి ప్రవీణ్ ఇది, నన్ను ఇంత త్వరగా రమ్మని, నువ్వు లేట్ చేసావ్ ఏంటి? అని గారాబంగా అడిగింది. ఏం లేదు బంగారం మా ఇంట్లో వాళ్ళని నిద్ర పుచ్చి వచ్చేసరికి ఇలా అయింది, అని బుజ్జగించాడు లలితని.

హా నీకే అలా ఉంటే మరి నేను ఆడ పిల్లని, ఏమని రావాలి అని రాగాలు తీసింది లలిత. అబ్బా పోనీ ఇప్పటికైనా వచ్చా కదా! ట్రైన్ వస్తుంది వెళదాం అంటూ లలిత కూడా తీసుకొని, ట్రెయిన్ ఎక్కారు ఇద్దరూ.

లలిత, ప్రవీణ్ లు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కాబట్టి తమ ఇళ్ళల్లో ఒప్పుకోరని, ఇలా లేచిపోతున్నారు. లలితకి చాలా దిగులుగా ఉంది. ఏప్పుడు అమ్మా నాన్నని విడిచి ఉండలేదు. కానీ ఇప్పుడు ఆ బంధాలన్నీ ప్రవీణ్ కోసం తెంచుకొని ప్రవీణ్ తో వస్తోంది నమ్మి, మరి ప్రవీణ్ కూడా మంచివాడే.

ఎవరైనా తమని వెతుకుతూ వస్తారేమోనని భయం భయంగా ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపారు. ఆ రైలు బొంబాయి పోతుంది. అక్కడైతే తమను ఎవరూ గుర్తు పట్టరని ప్రవీణ్ బొంబాయి వెళదామని, లలితతో చెప్పి తీసుకొని వచ్చాడు.

తెల్లారేసరికి వాళ్ళిద్దరూ బొంబాయి పట్టణంలో రైలు దిగారు. ప్రవీణ్ కి అన్ని తెలిసినట్లుగా గబగబా బయటకు వచ్చి ఒక ఆటో మాట్లాడి, అందులో లలిత నీ ఎక్కించి సామాను పెట్టి, ఒక హోటల్ పేరు చెప్పాడు. ఆటో అతను వారిని వింతగా చూశాడు. అదేమీ పట్టించుకోకుండా, ఛలో బాయ్ అని అన్నాడు ప్రవీణ్. ఆటో ఆ హోటల్ ముందు ఆగింది.

ఆ హోటల్ వాళ్ళు ప్రవీణ్ ని అందులోంచి దిగుతున్న లలితను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ అరే ప్రవీణ్ బాయ్ ఇప్పుడే నా రావడం నువ్వు చెప్పినట్టుగా రూమ్ సిద్ధంగా ఉంది అని చెప్పి రూమ్ బాయ్ ని ఇచ్చి పంపించాడు హోటల్ యజమాని.

ఆ రూమ్ మామూలు కన్నా, చాలా గలీజ్ గా ఉంది. ఇదేంటి రూమ్ ఇలా ఉంది అని అంది లలిత. అయ్యో లలిత ఇంతకన్నా మంచి రూమ్ వెతికి అందులో మనం ఉంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ చిన్న హోటల్ లోనే మనం ఉండక తప్పదు అని చెప్పాడు లలితకి.

లలిత కూడా అది నిజమన నమ్మి, నాకు చాలా చిరాకుగా ఉంది నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని అంది లలిత. స్నానం తర్వాత అని లలితని గట్టిగా కౌగిలించుకున్నాడు ప్రవీణ్. అబ్బా ప్రవీణ్ వదులు ఇవన్నీ పెళ్లయ్యాకే అని చెప్పా కదా?

మళ్లీ ఇదేంటి? అని అంటూ అతన్ని విడిపించుకుని సిగ్గుపడుతూ, స్నానం చేయడానికి బాత్రూం లోకి వెళ్ళింది. ఇంతలో ప్రవీణ్ కి ఏదో ఫోన్ రావడంతో బయటకి వెళ్లి రెండు నిమిషాలు మాట్లాడి వచ్చాడు అతను వచ్చేసరికి లలిత స్నానం చేసి ఫ్రెష్ గా తయారై వచ్చింది.

లలితను చూసిన ప్రవీణ్ ఆగలేక అబ్బా ఎంత బాగున్నావ్ ఇంత అందాన్ని ఇన్నిరోజులు ఎక్కడ దాచావు లలిత అని అంటూ తన కౌగిలిలో బంధించాడు.

ఆ కౌగిలిలో ఉన్న మత్తుకు తనకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో లలిత అతనికి లొంగిపోయింది ఎలాగూ పెళ్లి చేసుకుంటాం అనే నమ్మకంతో….

అలా వాళ్ళు కాలం తెలియకుండా, తిండి తిప్పలు లేకుండా ఒళ్ళు తెలియకుండా, స్వర్గా సుఖాలు అనుభవించారు. లలితకి ఇంకా ఏదో కావాలని అనిపించసాగింది, అలా మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఆదమరచి నిద్రపోతున్న లలితని ఏ ఏయ్ లే లేస్తావా లేదా అని అంటూ భుజం మీద కొడుతూ లేపుతున్నాడు ప్రవీణ్.

ఒక్క నిమిషం తాను ఎక్కడున్నానో తెలియని పరిస్థితిలో కళ్ళు తెరిచింది లలిత. ఏంటి ప్రవీణ్ ఏమైంది ఎందుకు అలా లే పు తున్నావ్, కాస్త మెల్లిగా పిలవచ్చు కదా, అంది లలిత.

నువ్వు ఒక పెద్ద దొరసానివి. నిన్ను లేపాలంటే చెలికత్తెలు రావాలా ఏంటి చాలు చాల్లే లేచి ముందు స్నానం చేసి రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళాలి అని అన్నాడు కోపంతో ప్రవీణ్.

ఎప్పుడూ చూడని లలిత చాలా భయపడింది ప్రవీణ్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ నువ్వు నేను ఏ తప్పు చేశాను అని అంది ఏడుపు గొంతుతో.

తప్పా నువ్వు చేసింది తప్పు కాక ఇంకేంటి నేను నిన్ను బంగారం డబ్బు తెమ్మని అంటే నువ్వు ఏంటి చిల్లర్ దానిలాగా కొన్ని బట్టలు తీసుకొని వచ్చావు అంతే తప్ప ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకురాలేదు అని అన్నాడు.

అయితే ఇప్పుడు ఏమంటావ్? డబ్బు, బంగారం తీసుకొస్తే నన్ను ప్రేమిస్తావా దానికోసమే నన్ను ప్రేమించావా అయినా నీకు ముందే చెప్పాను నేను నిన్ను మనసారా ప్రేమించాను నాకు డబ్బు అక్కర్లేదని. అయినా అది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు దాన్ని నేను ఎలా తీసుకు వస్తాను అని అంది లలిత.

పో పోవే ఛీ ఛీ నిన్ను చూసి ఎవరిని ప్రేమించాడు నీ వెనకాల ఉన్న ఆస్తి చూసి, ఈ డబ్బు చూసి నిన్ను ప్రేమించాను. నువ్వు తెచ్చిన డబ్బుతో జల్సాలు చేయవచ్చు అని అనుకున్నాను కానీ నువ్వు ఏమీ తేకుండా వచ్చావు ఇక నువ్వు నాకు ఎందుకు అవసరం లేదు నీ దారి నీది నాదారి నాది కానీ ఒకటి….

నేను నీ మీద చాలా ఖర్చు చేశాను నీకు బహుమతులు కొనిచ్చాను, నీకు బట్టలు కొనిచ్చాను, ఐస్క్రీమ్లు కొనిచ్చాను, సినిమాలకు తీసుకెళ్ళాను, దానికి నాకు చాలా ఖర్చు వచ్చింది అందుకని నిన్ను నేను ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో ఒకచోట అమ్మేసి పడేస్తాను.

దానికి నాకు తగిన డబ్బు వస్తుంది నువ్వు ఎంతో కొంత అందంగానే ఉంటావు కాబట్టి నా డబ్బు నాకు తిరిగి వస్తుంది. కాబట్టి నేను చెప్పింది విను, లే త్వరగా తయారవ్వు, అని అంటూ బయటకు వెళ్ళిపోయాడు తలుపులు వేసి…

ప్రవీణ్ ని నమ్మి తన సర్వస్వం అర్పించి, మనసారా ప్రేమించిన పాపానికి, తనీ శిక్ష అనుభవించాల్సిందే అని ఏడుస్తూ తనని కన్న తల్లిదండ్రులని మోసం చేసి వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంది లలిత.

ఇంతలో ప్రవీణ్ వచ్చి, ఇంకా రెడీ అవ్వలేదా. నీకు ఇలా కాదు అని మత్తు మందు చల్లిన గుడ్డ ముక్కని వాసన చూపించి, సృహ తప్పించి తీసుకువెళ్లి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు.

వాళ్లు 10 వేలు ఇచ్చారు ప్రవీణ్ ఇంకో అమ్మాయికి గాలం వేయడానికి వెళ్ళాడు. పాపం లలిత తనని ప్రేమించిన ప్రవీణ్ ఇలాంటి వాడు అని తెలియక వాడి మాయలో పడింది. మీరూ అలా పడకండి.

అమ్మాయిలు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని వెంటపడేవారిని నమ్మకండి. ప్రేమలో నిజముందో లేదో తెలుసుకొని మీ తల్లిదండ్రులకు చెప్పండి వారే అన్ని విధాలా మీకు చూసి సరిజోడు అనిపిస్తే పెళ్లి చేస్తారు అలా కాకుండా లేచిపోయి వెళ్ళిపోతే లలిత లాగా రెడ్ లైట్ ఏరియాలో మగ్గిపోతారు. అమ్మాయిలు జాగ్రత్త….

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *