రారండోయ్! సూర్యుని చూద్దాం!
వారం క్రితం సూర్యున్ని మబ్బులు
కిడ్నాప్చేశాయా, లేక సూర్యుడే
చలికి మబ్బుల దుప్పటి కప్పుకొన్నాడా!
అని మనం ఘోషతో తికమకలో కొట్టు మిట్టాడు తుంటే మన గోస తీర్చ
మబ్బుల దుప్పటి లోంచితొంగి చూస్తున్నాడు మన సూర్యకిరణ్.
ఎట్టకేలకు నాలుగు యాభైనించి హాయ్ చెప్పి దాగుడుమూతలాట మొదలుపెట్టాడు.
మళ్ళీ సాయంత్రానికి వేరేవాళ్లకి దర్శనమివ్వాలని ఆత్రంగాఉన్నట్టున్నాడు.
హమ్మయ్య ఎట్టకేలకు తన కిరణాలతో న్యూరో్బియన్ ఇంజక్షన్ ఇచ్చినట్లుంది.
సూర్యునికి హాయ్ చెప్పిమబ్బులకి వీడ్కోలు చెప్దాం.
రారండోయ్! రారండోయ్! సూర్యుని చూద్దాం రారండోయ్! అని పాటపాడుదాం.
– రమణ బొమ్మకంటి