ఉనికి

ఉనికి

నీలికిరణాలతో
నులివెచ్చని వెలుగుతో
వచ్చేశాయొచ్చేశాయి
మేఘరాజాలు

స్తంభించిన జీవనం
సంకెళ్ళు వీడాయి
విచ్చుకుంటూ ఉదయం
మళ్లీ నవ్వటం మొదలెట్టింది!

తెలివి నేర్చిన మనిషి
తేడాలను తట్టుకోలేడు
కానీ
తేడాలను సృష్టిస్తాడు
కాలమందుకే తన ఉనికిని గుర్తుచేస్తూ ఉంటుంది

– సి యస్ రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *