ప్రియా
ప్రియా,
మామూలు పాదాచారుడిగా వెళ్తున్న నాకు, ఏ తపస్సు చేయక పోయినా ఎదురుగా
ఒక నడిచొచ్చే దేవత కన్పించింది. నా శరీరంలోని సిరలు, ధమనులు రక్త వేగానికి
రాగాలు మీట ప్రారంభించాయి. ఈ అలజడేంటి అని ప్రశ్నించుకున్న నాకు, నా
అంతరంగంలో మారు మ్రోగుతున్న రాగాలు, “ఇదే ప్రేమరా, ఓ పిపాసి” అని శ్రావ్యంగా
చెప్పాయి.
ఆకలి వద్దన్నది భోజనము, నిద్దుర వద్దన్నది పడుక, అలా తెరచిన కళ్ళు రాత్రంతా
వీక్షించే ప్రయత్నం చేసాయి. తీపిగాయము పెద్దదాయెను ఒక్క రాత్రిలో……
“ఓ భగవంతుడా మందులేని ఈ గాయానికి ఆమె నిత్యదర్శనము సంప్రాప్తించు.” అని
వేడుకుంటిని.
అదేమి, అందము నీది, దేవీ…! నా కళ్ళు నీ మూర్తిని నిలువరించకున్నాయి. నీవు
ఉవ్వెత్తున లేచిన అలలా కనిపించి మాయమౌతావు. అసూయతో గాలి రివ్వున నా కళ్ళకి
గంతలు కట్టేస్తోంది. నీ పరోక్షంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఈ జీవికి శ్వాసను
వరంగా ప్రసాదించు.
నా ప్రేమకి నీ ప్రేమని బహూకరించు.
ఎదురు చూస్తూ ఉంటాను
ఇట్లు
– వాసు