ప్రశ్నించిన కలం
ఆకాశాన్ని కాగితంలా మలుచుకుని…..
నిత్యం కష్టించే పేదల కష్టాన్ని…..
శ్రామికుల చెమట చుక్కలను…..
ఇంకులా చేసుకుని….
పెన్నును గన్నుగా….
అక్షరాలను తూటాలా మార్చుకుని….
పేద వారిపై, కర్షకుల పై, శ్రామికుల పై…..
జరుగుతున్న దోపిడీని
తన కవిత్వంతో ప్రశ్నించి…..
ఘోరాలను ఎదిరించగ ముందుకు అడుగేసి….
బలహీన వర్గాలలో చైతన్యం కలిగించి….
వారిని తనతో కదిలించి…..
అడుగడుగునా నేనున్నానంటూ….
కదం తొక్కి…
మార్పు దిశగా నిరంతరం పయనించిన
అక్షర సూరీడు….
ప్రజల గుండెల్లో నిలిచిన
ప్రజాకవి…
సాహిత్య లోకానికి
మార్గదర్శకుడిగా నిలిచిన….
మహా కవి…. శ్రీ శ్రీ
– రహీంపాషా