వీధి బాలలు
ఉసూరుమనిపించే ఉషోదయాలు…
ఉద్యమంలా సాగుతుంటాయి….
అక్కరలేని పెంటకుప్పల్లో…
విసిరేసినా ఆకుల్లా…
నడక నేర్చిన బాల్యం…
నాలుగు కూడళ్ళలో
కలుసుకుంటుంది…
డబ్బు అనే జబ్బును భుజాన మోస్తూ
అమ్మఒడిలోని వెచ్చదానన్ని…
ప్లాస్టిక్ సంచుల్లో వెతుకుంటూ….
విధి వారిని విసిరేసినా…
గుడ్డి దీపాల వెలుగులో నిద్దరోతుంటుంది…
ప్లాస్టిక్ సీసాలా పాదరక్షలు
పాదుకల కన్నా గొప్పవి…
మరోతరపు బాల్యాన్ని
తనపై మోస్తున్నందుకు….
కారే చెమట….ఉప్పగానే ఎందుకుంటుందో… దాహార్తిని తీర్చే…
చలువ నీరైతే ఎన్ని గొంతుకలను
తడపగలావో …..
ఎన్ని తరాలు మారినా
తలరాతలు మారని
వీధిబాలల జీవితాలలో
కొత్త ఉషస్సులు వచ్చేదెన్నడో
– కవనవల్లి