ప్రభాత పరిమళం

ప్రభాత పరిమళం

మదిదోచే పూలు
అదుపు తప్పిన ఆలోచనలకు కళ్ళాలు!
కళ్ళారా చూశామా
మనసు వాకిట కళ్ళాపి చల్లినట్టే !
కరిగిపోయే కాలం
తీపి చేదుల చరితకు ఆనవాలేమో కానీ
కనిపించే పూల సంబరం మాత్రం
ఉదయానికి హృదయానికీ చేరువయ్యే చిలిపి మంత్రం!

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *