న్యాయం.. ఆనవాళ్ళు

న్యాయం.. ఆనవాళ్ళు

అడుగడుగునా అన్యాయం..
అంతటా అన్యాయం..
అన్నింటా అన్యాయం..

న్యాయపు వెలుగు రేఖలు చూడని సూర్యోదయం..
న్యాయపు ఆనవాలు లేక అస్తమిస్తోన్న సూర్యాస్తమయం..

న్యాయం ఓ భరోసా..
న్యాయం ఓ ఆశ..
న్యాయం ఓ వెలుగు రేఖ
న్యాయం ఓ విశిష్టత
న్యాయం ఓ విప్లవం
న్యాయం ఓ సామాజిక బాధ్యత..

న్యాయం కోసం విలవిలలాడుతూ, అన్యాయపు శృంఖలాలో నలిగి రాలిపోతున్న వారందరికీ మరియు న్యాయ స్థాపన పోరాట వీరులకు/ధీరులకు చేస్తున్నాను లాల్ సలాం ‌

– కిరీటి పుత్ర రామకూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *