న్యాయం.. ఆనవాళ్ళు
అడుగడుగునా అన్యాయం..
అంతటా అన్యాయం..
అన్నింటా అన్యాయం..
న్యాయపు వెలుగు రేఖలు చూడని సూర్యోదయం..
న్యాయపు ఆనవాలు లేక అస్తమిస్తోన్న సూర్యాస్తమయం..
న్యాయం ఓ భరోసా..
న్యాయం ఓ ఆశ..
న్యాయం ఓ వెలుగు రేఖ
న్యాయం ఓ విశిష్టత
న్యాయం ఓ విప్లవం
న్యాయం ఓ సామాజిక బాధ్యత..
న్యాయం కోసం విలవిలలాడుతూ, అన్యాయపు శృంఖలాలో నలిగి రాలిపోతున్న వారందరికీ మరియు న్యాయ స్థాపన పోరాట వీరులకు/ధీరులకు చేస్తున్నాను లాల్ సలాం
– కిరీటి పుత్ర రామకూరి