నేటి తరం యువశక్తి
ఎదురులేని యువశక్తి ఏదైనా సాధించే
దేశానికి పెట్టుబడి!
ఎంచుకున్న రంగంలో
ఎంతో గొప్ప ధైర్యంతో ముందుకు నడపాలి!
స్వయంకృషి నీ సొంతమైనప్పుడు
మార్గానికి అడ్డు లేదు!
అపార జ్ఞానంతో అంతులేని విజయాలు
యువతకే సొంతం!
సమాజమే ప్రమాణంగా సరిచేసే మార్గాలైహద్దులు లేని అవకాశాలు
అందిపుచ్చుకోవాలి యువత!
గూగుల్ అమ్మ గురువుగా ఉన్నా నీకు నీవుగా గురువైన రోజు మంచి రోజు ముందుంటుంది
ప్రలోభాల పాత్ర లేకుండా
దురలవాట్లకు దూరంగా
మేల్కొనక తప్పదు ఇప్పటి యువత!
సంస్కారాల సామ్రాజ్యం
నిర్మించి సరికొత్త సవాళ్లు
అదికమించాలి ఎన్నో!
వినూత్నపు ఆలోచనతో
భావి భారత పౌరులై
సిరుల సంపదకు శ్రీకారం చుట్టాలి !
వెన్ను తట్టి మేధస్సుకు పదును పెట్టి దేశాన్ని
ప్రగతి పథంలో నడిపించే యువత కావాలి !
వివేకానందుని స్ఫూర్తితో
వివేకవంతులుగా అనునిత్యం ఆత్మవిశ్వాసంతో
వెలుగులు నింపాలి….
– జి జయ