డిటెక్టివ్ ఎపిసోడ్ 8

డిటెక్టివ్ ఎపిసోడ్ 8

కెనడాలోని మనిటోబోకు చెందిన మిషెల్లీ క్రెయిగ్టన్ (44) కి ఓ నీడ కనిపించింది. అప్పటి వరకు బంధుమిత్రులు ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు. తెరల మాటున కనిపించిన నీడ ఆమెకు సాంత్వన ఇచ్చింది. మిషెల్లీ ఆత్మీయంగా పెంచిన కుక్క ఓక్లీ ఏప్రిల్ లో ప్రాణాలు విడవటంతో ఆమె తట్టుకోలేకపోయారు. క్షణక్షణం ఓక్లీనే గుర్తు చేసుకుంటూ రోదించారు. అయితే ఇటీవల ఓ రోజు ఆమెకు తన లివింగ్ రూమ్ లో కర్టెన్స్ వెనుక ఓక్లీ లీలగా కనిపించింది.

దీంతో ఓక్లీ తనకు దూరంగా లేదని, ఆత్మ రూపంలో తనకు దగ్గరగానే ఉందని చాలా సంతోషించారు. బంధుమిత్రుల రూపంలోని ఆత్మీయులు ఎంతగా ఓదార్చినా ఆమె మనసు కుదుట పడలేదు కానీ, దయ్యం రూపంలో తన పెంపుడు కుక్క కనిపించేసరికి ఆమె గొప్ప శాంతి పొందారు. మిషెల్లీ మాట్లాడుతూ తాను మొదటిసారి ఓక్లీ నీడను చూసినపుడు తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయని భావించానన్నారు.

కానీ తదేకంగా చూసినపుడు ఆ నీడ తన ఓక్లీలాగానే కనిపించిందని చెప్పారు. ఆ నీడను తాను ఫొటోలు తీశానని చెప్పారు. అది కచ్చితంగా ఓక్లీయేనని ఆ ఫొటోల్లో నీడ స్పష్టం చేస్తోందన్నారు. తాను చెబితే ఎవరైనా నమ్ముతారో లేదోనని, ఫొటోలు తీసినట్లు తెలిపారు. తాను పడకపై నుంచి లేచి తెరలను తొలగించి చూశానని, ఆ నీడ మాయమైపోయిందని చెప్పారు. ఈ సంఘటనతో తన మనసు ప్రశాంతంగా మారిందన్నారు. తన ఓక్లీకి ఏమీ కాలేదని నమ్ముతున్నానన్నారు.  ఓక్లీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. అంటే తన ఇంట్లోనే, తనతోనే ఉన్నట్లు నమ్ముతున్నానని చెప్పారు.

నిత్యం రద్దీగా వుండే ప్రాంతం… అక్కడ ఓ పానీపూరి బండి వుంది. నీట్ గా డ్రెస్ వేసుకుని వున్నాడు.చేతులకు తడి అంటకుండా గ్లోవ్స్ వున్నాయి. కార్పోరేట్ స్టైల్ లో వున్నాడు. దాదాపు వందకు పైగా పానీపూరి బండ్లు సిటీలో వివిధ ప్రాంతాల్లో వున్నాయి. మెడలో ఏప్రాన్ లాంటిది కట్టుకున్నారు. వాళ్ళు వేసుకున్న చొక్కా మీద చిన్నగా డి అక్షరం వుంది. కేవలం కొద్దిరోజుల్లోనే డి పానీపూరికి యూత్ ఎడిక్టయ్యారు.

కాలేజీ పిల్లలు ముఖ్యంగా కాలేజీ ముందు మార్నింగ్ టైములో కూడా అందుబాటులో వుండే పానీపూరి సాయంకాలాల్లో కూడా అందుబాటుకిలోకి వచ్చాయి. అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉండడం వల్ల చాలామంది మొబైల్ టిఫిన్స్ కన్నా పానీపూరీకే ఎడిక్ట్ అవుతున్నారు. డిటెక్టివ్ సిద్ధార్థ నీట్ గా కార్పోరేట్ స్టైల్ లో డ్రెస్ వేసుకున్నాడు. టక్ చేసుకున్నాడు. చలువ కళ్లద్దాలు మొహాన్ని కవర్ చేస్తున్నాయి. టీనేజ్ యువత వేలంవెర్రిలా ఉందక్కడ.

ఒక్కొక్కరు ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తున్నారు. ఆ గప్ చుప్ (పానీపూరి) బండి పక్కనే నలుపురంగు దుస్తులు ధరించిన ఇద్దరు బలిష్ఠులైన వ్యక్తులు వున్నారు. సిటీలో వున్న ప్రతీ బండి దగ్గర ఇద్దరేసి వ్యక్తులు వుంటారు. ఎటువంటి గొడవ జరిగినా ఆ ఇద్దరు వ్యక్తులు పానీపూరి బండివాడిని రక్షిస్తారు. వాడి ప్యాంటు జేబులో రివాల్వర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఎప్పుడు ఎవరికీ ఏ ప్రమాదం వచ్చినా కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. మిగితావాళ్ళు ఎలర్ట్ అవుతారు.

డిటెక్టివ్ సిద్ధార్థ తన పక్కనే వున్న పంజాబీ అమ్మాయి వంక చూసి “బలే బలే” అన్నాడు. “పంజాబీ అమ్మాయిలా వున్నానని బలే బలే అని సింబాలిక్ గా అనాల్సిన అవసరం లేదు” సీరియస్ లుక్కొకటి ఇచ్చి అంది పంజాబీ గెటప్ లో వున్న సుగాత్రి. “ఐసీ..” అని పానీపూరి వాలా వంక చూసి “దో ప్లేట్ పానీపూరి” అన్నాడు… “పానీపూరి అతడు రెండు ప్లేట్స్ లో పానీపూరి పెట్టిచ్చాడు. సిద్ధార్థ సుగాత్రి పానీపూరి బండికి పక్కనే వున్న బలిష్ఠులైన వ్యక్తులకు దగ్గరగా వెళ్లారు..

ఈలోగా సిద్ధార్థ తన చేతిలో వున్న టప్పర్ వేర్ బాగ్ చేతిలోకి తీసుకుని అతి వేగంగా బ్యాగ్ ఓపెన్ చేసి అందులో వున్న బాక్స్ తీసి పానీపూరీని అందులో వేసాడు. తర్వాత టప్పర్ వేర్ బ్యాగ్ క్లోస్ చేసాడు.. పానీపూరి తింటున్నట్టు ఆక్ట్ చేసాడు… పనిలోపనిగా సుగాత్రి ప్లేట్ లోని పానీపూరి ఒకటి తిన్నాడు. “కావాలంటే మరో ప్లేట్ తినొచ్చుగా.. నా ప్లేట్ లోని పానీపూరి లాగేసుకోకపోతే” అంది సుగాత్రి పక్కనున్న వ్యక్తికి వినిపించేలా…

“అదేమిటో డార్లింగ్ నీకన్నా ఈ పానీపూరీలో కిక్కు ఎక్కువగా వుంది… ఈ బ్యూటీ పూరీలో లేని కిక్కు ఈ పానీపూరీలో వుందా” అన్నాడు సుగాత్రి వైపు చూసి “ఓ పది ప్లేట్లే పార్సెల్ తీసుకువెల్దామా.. రాత్రంతా తింటూ ఉండొచ్చు” అంది సుగాత్రి. ” నో పార్సెల్ ఓన్లీ ఇక్కడే ఈటింగ్.. పార్సెల్ ఇవ్వరట..” అన్నాడు సిద్ధార్థ .. వెంటనే సుగాత్రి తన హ్యాండ్ బాగ్ లో నుంచి రెండువేల రూపాయల నోటు తీసి “ఇదిచ్చినా ఇవ్వడా? అంది. “ఉహూ…” అన్నాడు సిద్ధార్థ వీళ్ళ మాటలు వింటున్న ఆ ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు చిన్నగా నవ్వుకుని..” వాళ్ళవైపు ఓసారి చూసి…: మీకు పానీపూరి పార్సెల్ కావాలా మేడం” అని అడిగాడు.

వెంటనే సిద్ధార్థ ఆ బలిష్టమైన వ్యక్తి భుజం పట్టుకుని “హలో ఇక్కడ మాకు కూడా కావాలి.. ఏంటి అమ్మాయిలకేనా?” అన్నాడు కోపం నటిస్తూ “సారీ సర్.. మీ ఇద్దరికీ.. ఓకేనా… ఇంతకూ మీరెక్కడ వుంటారు? చిన్న అనుమానం తో అడిగాడు – ఇద్దరూ ఒకేసారి చెప్పారు “ఆ అడ్రెస్ కు మా మనిషి వస్తాడు..” చెప్పారు వాళ్ళు “ఒట్టు” బలిష్టమైన వ్యక్తి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగాడు “ఒట్టు సర్” అన్నాడు ఆ వ్యక్తి.

అతని సన్నని మీసాలు పట్టుకుని పీకే యత్నం చేస్తూ “గుడ్డు బాయ్” అన్నాడు చిన్నగా కేకవేసాడు మీసాలు లాగడంతో ఆ వ్యక్తి కోపాన్ని అణుచుకుని “ఇట్స్ ఒకే సర్” అన్నాడు. తరువాత సుగాత్రి సిద్ధార్థ వెళ్తున్న హోండా యాక్టివాను ఫాలో చేయమని వేరే ఎవరికో ఫోన్ చేసారు… సిద్ధార్థ సుగాత్రి ఒక అపార్టుమెంట్ దగ్గరికి వెళ్లారు.. ఒక ప్లాట్ దగ్గరికి వెళ్లి తలుపు తీసి లోనికి వెళ్లి తలుపు మూసుకున్నారు.

వాళ్ళను ఫాలో అయినవ్యక్తి అది చూసి ఎవరికో ఫోన్ చేసి. “ఓకే నో డౌట్ కరెక్ట్ అడ్రస్” అని చెప్పారు. తమని ఫాలో చేసిన వ్యక్తి అపార్టుమెంట్ నుంచి వెళ్లేవరకూ వుంది… డ్రెస్ మార్చుకుని అపార్టుమెంట్ వెనుకవైపు నుంచి వెళ్లిపోయారు సిద్ధార్థ సుగాత్రి. చీకటి తెరలు సిటీని చుట్టేసాయి, సుగాత్రి డ్రెస్ మార్చుకుంటుంది. సిద్ధార్థ హాలులో నుంచి అరిచాడు.. “త్వరగా డ్రెస్ మార్చుకుంటే.. మనం యాక్షన్ లోకి దిగొచ్చు..”

“మీలా తొక్కలో ప్యాంటు షర్ట్ కాదు.. చీర బ్లోజ్..” అని ఆగింది. “కంటిన్యూ ప్లీజ్ వాంజ్..” అన్నాడు సిద్ధార్థ అటువైపు నుంచి సైలెన్స్ చీర మార్చుకుంటున్న సుగాత్రి ఒక్క క్షణం సిగ్గు పడింది. సిద్ధార్థ షార్ప్ బుర్రకు తన మాటలు అర్ధమయ్యే ఉంటాయి. అయినా అతగాడి గురించి తెలిసి దానిలా మాట్లాడకూడదు. ఎంతైనా తనకు నోటి దూల ఎక్కువే” అని తనను తాను తిట్టుకుంది. సిద్ధార్థ మొహంలో ఫీలింగ్స్ గుర్తుకు చేసుకుంది.

(ఇంకా వుంది)

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *