నేను అనే వెలుగు
కళ్ళు మూస్తే చీకటి కనిపిస్తోంది…
చీకట్లో ఎక్కువసేపు ఉండటమే చాలా కష్టం…
కానీ కొన్ని సందర్భాల్లో చీకట్లోనే బతకాల్సి వస్తుంది….
కానీ ఆ చీకట్లోనే మనం బాధపడకుండా ధైర్యంగా
ఆ చీకటితో స్నేహం చేసి వెలుగు అనే నిచ్చెన ఎక్కాలి..
మన గమ్యం ఏంటో మర్చిపోకుండా
ప్రతిసారి గుర్తు చేస్తూ బాటలు వేయడానికి సహాయపడుతుంది.
చీకట్లో ఒక రోజంతా ఉండడం చాలా కష్టమే
కానీ ఆ చీకట్లోనే నేను బతుకుతూ ఉండి
నా గమ్యం ఏమిటో తెలుసుకొని
కొత్త కొత్త విషయాలు గురించి తెలుసుకొని
ఆ చీకట్లోనే వెలుగు అనే నిచ్చెన ఎక్కుతూ
నేను ఆ చీకటిలో కోయిల ఉంటున్నాను..
చీకటి లో నేను ఒదిన నా మనసు…
నా అనే ప్రపంచంలో నేను అనే వెలుగుతో ఉన్నాను.
- మాధవి కాళ్ల