నీ ఋణము తీర్చలేనిది!!
చేర్చితివి నన్ను
ఓ, నది ఒడ్డుకు,
నా దాహార్తిని తీర్చ.
ఒడ్డు నెక్కెను ఇట్లు నా దప్పిక.
నా క్షుద్బాధ నెఱింగి
పంచ భక్షాలను నుంచితివి
నా అక్షి కి చేరువన.
నిన్ను ఆర్ధించకనే,
నేను బిక్షువు నైతిని.
పాదాచారి నే నేను
కానీ పరుగులెడుతూ ఉంటిని.
నాకు చెట్టునీడ వై
చలువ నిచ్చితివి.
నేను ఇట్లు
విలవిల నైతిని,
నీ విలువ
నాకు వెల లేనిదని తెలిసెను.
ప్రియ మాయే
నా ఊపిరి నాకు.
కష్టమయ్యే నా శ్వాస నాకు.
నీ ఋణము తీర్చ
మళ్ళీ జన్మిస్తా నీకోసం.
– వాసు