హొలీ ఎందుకు జరుపుకుంటారు?
హోలీ ప్రతి ఏటా ఫ్హాల్గుణ మాసం లో వస్తుంది. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.
నిత్యం విష్ణు నామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడుపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు తన సోదరి హోళికా పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు.
ఆమెకి లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమి చెయ్యదు అన్న ఆజ్ఞ తో, బాలుడు అని చూడకుండా ప్రహ్లాదునితో కలిసి అగ్నిగుండం లోకి వెళుతుంది.
అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకొనే ఆ పరమాత్మ మౌనంగా ఉండగలడా… ఆ చిద్వినస్మూర్తి వెంటనే ఆ బాలుడికి మంటలు తాకకుండా అనుగ్రహించారు.
వెంటనే ప్రహ్లాదుడు మంటల నుండి సురక్షితంగా బయటికి వచ్చాడు. కానీ, హోళికా మంటలకు ఆహుతి అయి ప్రాణాలు విడిచింది.
మీకు ఒక సందేహం రావచ్చు హోళికాకు వరం ఉందిగా అని కానీ ఒంటరిగా అగ్ని ప్రవేశ చేస్తే తనకు వరం లభిస్తుంది. తను బాలుడిని తీసుకోని మంటలోకి వెళ్ళింది కనుక వరం ఫలించక హోళికా చనిపోయంది. హోళికా చనిపోయిన రోజుని పురస్కరించుకోని హొలీ పండుగ జరుపుకుంటాం.
చిన్ని కృషుడు బృందవనం, గోకులంలోని తన బాల్యంలో చేసిన కార్యలను గుర్తు పెట్టుకొని, ఈ పర్వదినంను రంగ రంగులతో జరుపుకుంటారు.
హొలీ సందర్భంగా కామదహణం కూడా నిర్వహిస్తారు. మన్మథుడుని పరమేశ్వరుడు భస్మం చేస్తాడు అందుకనే హొలీ రోజు కామదహణం చెయ్యడం సంప్రదాయం..
చెడు మీద మంచి విజయం పొందిన సందర్భంగా హొలీ పండుగ జరుపుకుంటారు
మీకు మీ కుటుంబ సభ్యులకు హొలీ పండుగ శుభాకాంక్షలు
– శ్రావణ్