నగుమోము
ఆ నటనం ఎందరి పెదవులకో నవ్వుల వరమిస్తుంది…
ఆ వదనం మరెందరి మనసులనో తేలిక పరుస్తుంది…
చూడగానే హాస్యం పంచే ఆకారమది….
ఆహార్యపు ఆటలతో సంతోషం నింపునది…
దాచుకున్న ముఖానికి పరదావంటిది…
కన్నుల్లో దాగిన వేల నిశీధులు కానలేము…
అసలు ముఖము కానక సంతసించేము…
తినను తిండి లేకున్నా నవ్వించడం మరువడు…
కష్టాల కడలి ఈదుతున్నా మనల్ని నిరాశ పరచడు…
జోకర్ గా నవ్విస్తూ నవ్వులపాలవుతుంటాడు….
మది మెచ్చి మనసారా నవ్వించు ముఖం….
నిశీధి కడలిలో ఆతని నివాసం…
నవ్విస్తూ మురిసిపోవు వృత్తి అతనిది..
ఆ నవ్వే కరువైన జీవితం వాస్తవమిది…
నిజమే ప్రతి నవ్వు వెనుక ఎన్ని విషాధాలో…
ఏ నవ్వులో ఏ చీకట్లు దాగున్నాయో…
ఏ నగుమోములో ఎన్ని విషాధాలున్నాయో….
ఏ జీవితం వెనుక ఎన్నెన్ని కడలి అలలు ఎగసిపడుతున్నాయో….
చూసేదంతా నిజం కాదు మరి వాస్తవమింకో సత్యం…
– ఉమామహేశ్వరి యాళ్ళ