నాలోని…. నీకు

నాలోని…. నీకు

బింబమా… ప్రతి బింబమా
సింధువా.. సిందూరమా..
సున్నిత హృదయమా…
మనసు స్వేచ్ఛకే అంతమా…
అనంతమా!!!!!!
జన్మా… ఇంకో జన్మా
చిన్న చిన్న కర్మలు
అవుతాయే ఖర్మలు
అమ్మాయే కదా అనుకోవద్దు
జన్మ ఇచ్చే అమ్మే కదా….
అమ్మ కడుపున కణమైన
వేళ తృంచి వేయలే…
అయ్యో.. ఎంత కరుణ
కన్నా… నా కణమే అన్న అమ్మ
మతి లేని మగాళ్లు
స్వేచ్ఛకు అర్థం చెపుతారా
మనసనే..
కొమ్ములనే నెత్తిన మోస్తూ
హృదయాన్ని కసాయి కమ్మితే
సమాజం ఒక వింత భ్రమలా
మిగిలితే… పగలదా……
తల్లి ఒడికి… దూరమై
ఎలా బ్రతుకుతావు…
మాయకుడా… అమాయకుడా…
మేలుకో ఇకనైనా… మేలుకో..
మనస్వని… మనస్వినే….
భవిశ్వత్తు.. భాద కావొద్దు
అణువులో చూడు
పరామణువులో చూడు
తననీ… తనలోని మనని
ప్రేమ శక్తిని…..
సాధించు, ఆస్వాదించు
జీవితం ఒక నందన వనమే
భావించు…
పరిపూర్ణంగా జీవించు….

– అల్లావుద్దీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *