కష్టే ఫలి

కష్టే ఫలి

రాము మరియు లోకేష్ ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. రాము మతపరమైన వ్యక్తి మరియు దేవుడిని చాలా బలంగా నమ్మేవాడు. లోకేష్ చాలా కష్టపడి పనిచేస్తాడు. ఒకసారి ఇద్దరూ కలిసి ఒక పెద్ద భూమిని కొన్నారు. ఆ భూమిలో వారు పంటను పండించి ఫలితం వచ్చాక సొంత ఇంటిని కట్టుకోవాలి అని అనుకున్నారు.

లోకేష్ పొలంలో చాలా కష్టపడ్డాడు కాని, రాము ఏమీ చేయలేదు. కాని అతడు దేవుని గుడికి వెళ్లి పంట మంచిగ పండటానికి దేవుడిని ప్రార్థించాడు. అదేవిధంగా, సమయం గడిచిపోయింది. కొంత సమయం తరువాత, పొలంలో పంట పండి, అమ్మడానికి సిద్ధంగా ఉంది. రెండింటినీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మిన తరువాత వారికి మంచి డబ్బు వచ్చింది. ఇంటికి వచ్చారు, లోకేష్ రాముతో మాట్లాడుతూ, “నేను ఇందులో ఎక్కువ కష్టపడ్డాను, కాబట్టి ఈ డబ్బును నేను ఎక్కువగా పొందుతాను”. అని అంటాడు.

ఇది విన్న రాము,”ఇందులో నుండి ఎక్కువ డబ్బును నేనే పొందుతాను. ఎందుకంటే, నేను పంట మంచిగా పండటం కోసం దేవుణ్ణి ప్రార్థించాను, అందుకే మనకు పంట మంచిగా పండింది. దేవుడు లేకుండా ఏమీ సాధ్యం కాదు”. అని అంటాడు. ఇద్దరూ ఈ సమస్యపై గొడవ పడ్డారు, తరువాత వారు ఇద్దరూ డబ్బు పంచుకునేందుకు గ్రామ పెద్ద వద్దకు చేరుకున్నారు.

గ్రామ పెద్ద, వారిద్దరి మాటలను విన్న తరువాత, ఒక్కొక్కరికి బియ్యం సంచులను ఇచ్చి, అందులో రాళ్లు కలిపారు. గ్రామా పెద్ద మాట్లాడుతూ “రేపు ఉదయం వరకు మీరిద్దరూ సంచిలో నుండి బియ్యం మరియు రాళ్ళను వేరుచేయాలి,” అప్పుడు ఈ డబ్బు ఎవరు ఎక్కువ అర్హులో నేను నిర్ణయిస్తాను. అని గ్రామ పెద్ద చెబుతాడు. వాళ్లిద్దరూ బియ్యం బస్తాలతో తమ ఇంటికి వెళ్లారు. లోకేష్ రాత్రిపూట మెలకువగా ఉండి బియ్యం మరియు రాళ్ళను వేరు చేశాడు. కాని, రాము మాత్రం బియ్యం బస్తాను తీసుకొని గుడికి వెళ్లి, బియ్యం నుండి రాళ్ళను వేరుచేయమని దేవుడిని ప్రార్థిస్తున్నాడు.

మరుసటి రోజు, లోకేష్ తనకు వీలైనన్ని బియ్యం మరియు రాళ్ళను వేరుచేసి, గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. గ్రామపెద్ద అది చూసి చాల సంతోషించాడు. రాము అలాగే వున్నా బియ్యం బస్తాని తీసుకొని గ్రామపెద్ద దగ్గరకు వెళ్ళాడు.

గ్రామపెద్ద రాముతో, “నీవు ఎన్ని బియ్యం వేరు చేశావో నాకు చూపించు”. అన్నాడు. బియ్యం మరియు రాళ్ళూ అంత విడి విడిగా అయిఉంటాయని, నాకు దేవునిపై పూర్తి నమ్మకం ఉందని రాము అంటాడు. సంచిని తెరిచి చూడగా, బియ్యం మరియు రాళ్ళు వేరుకాకుండా అంతా కలిపే వున్నాయి.

“నీవు కష్టపడి పనిచేసినప్పుడే దేవుడు కూడా సహాయం చేస్తాడు” అని గ్రామపెద్ద రాముతో అంటాడు. గ్రామపెద్ద ఆ డబ్బులో నుండి ఎక్కువ భాగాన్ని లోకేష్‌కు ఇచ్చాడు. దీని తరువాత రాము కూడా లోకేష్ లాగ పొలంలో కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు, కొన్ని నెలల తరువాత ఈసారి వారి పంట మొదటిపంట కంటే మెరుగ్గా ఉంది.

మనం ఏదైనా సాధించడానికి దేవునిపై నమ్మకం పెట్టుకొని కూర్చోకూడదు, విజయం సాధించడానికి మనం కృషి చేయాలి. అప్పుడే ఫలితం లభిస్తుంది”

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *