పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా

ప్రియా ఇన్నాళ్లు నీ వెనకాల తిరిగాను…
నీతో మాట్లాడాలని ఎంతో తహతహలాడాను….
నీ కళ్ళలో ఒక్కసారి అయినా పడాలని అనుకున్నా…
నీ మదిలో చోటు దొరుకుతుంది అని ఆశ పడ్డాను…
నీ మనసు కరగక పోతుందా అని ఎదురుచూసాను…
నీ హృదయంలో ఈ ధీనుడికి ఛోటిస్తావని కలలు కన్నా….
మా మనసులోని మాటను నీతో చెప్పాలని మన ఇద్దరి
జీవితాలని రంగుల మయం చేయాలని అనుకున్నా…
మన ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకున్నా…
అనుకున్నట్టే నీ మనసు కరిగింది నా ఆశ నెరవేరింది…
మన ఇద్దరి జీవితాలు రంగులమయం అయ్యాయి…
మన ఇద్దరి మధ్య దూరం తగ్గింది. కానీ మన
మనసులోని మాటలు బయటకు వినిపించవు…
నీ కళ్ళలో భావం, నా మదిలో తెలుస్తుంది…
నా మౌనం నీకు అర్థం అవుతుంది…
పెద్దల వల్లనే నా కల నెరవేరింది…
కానీ మన పలుకులు వారికి వినిపించాలి అంటేనే
వారు అర్థం చేసుకోలేక పోతున్నారు…
అయినా మౌనమే మన భాష అయినప్పుడు
ఇక వారికి అర్థం కాకుండా ఉంటుందా….
ఎప్పుడెప్పుడు నీ తీయని పలుకులు వినాలని
కోరికగా ఉంది. ఈ ఒక్క సారి మనం అనుకున్నట్టుగా
నీకు మాట వస్తె నేను ఎదురుచూసిన క్షణం నీ బంగారు
పలుకులు వినడానికి నేను క్షణాలు యుగాలుగా
వేచిచూస్తున్న నీ స్వర పేటికకు ఆపరేషన్ చేస్తే మాట
వస్తుందని తెలిసిన క్షణం నాకు కలిగిన ఆనందం చెప్పలేనిది….
నీకు మాటలు వచ్చాక ఈ నా మొదటి ప్రేమలేఖ చదువుతావని ఆశిస్తూ.. ఇదిగో నీ అద్దం దగ్గర అతికిస్తున్నా
నా మది మాటలు చదివి నన్ను అర్థం చేసుకుంటావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకై వేచి చూసే నీ ప్రియమైన సహచరుడు….

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *