నాథ నాదం
భర్త (వికటకవి) : ద్వారంబులు మూస్తిని,
కపిలంబు ఇంట జొచ్చ.
భార్య (కవయిత్రి) : నాకు లేని భయంబు,
నీ కేల నాథా.
భరించునది భర్త యనియా?
భర్త : పీల కపిలంబు నొక్కటి,
నా కలలో జొచ్చె నిన్న రాతిరి.
కనులార నిండిన నా నిద్ర
గాంచెన్ దాన్ని తేరిపార.
భయము నాది,
దాని పీలత్వం యందు.
ద్వారములు మూస్తిని,
నిను చూడ,
దాని కనులు తప్పగ.
– వాసు