మోసపోయిన అబ్బాయి జీవితం

మోసపోయిన అబ్బాయి జీవితం

సిద్దూ మంచివాడు అందరిలా చదువుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల కలలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఒక రోజు అతని జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది అదెలా అంటే తల్లిదండ్రులు సిద్దూకి ఫోన్ కొని ఇచ్చారు తన చదువుకోసం. అయితే ఒక రోజు ఒక ఫోన్ కాల్ ఆ సిద్దు జీవితాన్ని మార్చింది.

ఒక తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది అది చేసింది ఒక అమ్మాయి. అది తెలియని నంబర్ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఈ సారి ఆ అమ్మాయి సిద్దూతో నువ్వు మంచివాడిలా ఉన్నావు. వేరే వాళ్ళు అయితే ఈపాటికి ఎన్నో సార్లు తిరిగి ఫోన్ చేసేవారు. కానీ నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మంచి వాడివి అందుకే నేనే చేశాను అంటూ మాటలు కలిపింది.

అలా సిద్దూ ఆమె పేరు తెలియక పోయినా ఆమెతో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేవాడు. చదువులో వెనక పడ్డాడు. స్నేహితులను కలవడం మానేశాడు. తండ్రి జేబులోంచి డబ్బులు దొంగతనం చేస్తూ ఆమెకి గిఫ్ట్ లు రీఛార్జ్ లు చేయిస్తూ ఉండేవాడు. ఆమె తనను ప్రేమిస్తుంది అనుకున్నాడు. నిజంగానే ఆమె కూడా సిద్దూని ప్రేమిస్తున్నా అని చెప్పింది. దాంతో సిద్దూ తనని బాగా నమ్మాడు.

ఆమె ఎలా చెప్తే అలా చేశాడు. చదువు అటకెక్కింది. మార్కులు తక్కువ రావడం మొదలయ్యింది. ఇంట్లో ఇదంతా చూస్తున్న తల్లి సిద్దూని ఒక రోజు కూర్చోబెట్టి అసలు సంగతి ఏంటని అడిగింది. దానికి సిద్ధూ అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. తనకేమో సమస్యలు ఉన్నాయట అవన్నీ తీరిన తర్వాత నా దగ్గరికి వచ్చేస్తా అని చెప్పింది అంటూ తల్లితో ఉన్న విషయం చెప్పాడు సిద్దూ.

విషయం విన్న తల్లి నిజమే కాబోలు ఇప్పటికే పిల్లలు దొరకడం లేదు ఏదో ఒక అమ్మాయి అందులో ప్రేమ కాబట్టి ఇప్పుడు ఏమి అన్నా వాడు వినేలా లేడు. సరే ఏం జరుగుతుందో చూద్దాం అని మనసులో అనుకొని పైకి మాత్రం చూడు సిద్దు ఈ ప్రేమలు గీమలూ అన్నీ తర్వాత ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్ అని చెప్పింది. దానికి సిద్ధూ అదేం లేదమ్మా నేను బాగానే చదువుకుంటున్నాను ఉద్యోగం కూడా తొందర్లోనే వస్తుంది రాగానే పెళ్లి చేసేసుకుంటాను అంటూ తల్లికి సర్ది చెప్పాడు పాపం ఆ అమ్మ కొడుకుని బాగా నమ్మింది…..

ఇలా ఒకరినొకరు చూసుకోకుండా ఒక సంవత్సరం పాటూ ఫోన్ లోనే మాట్లాడుకున్నారు సిద్దూ, ఆ అమ్మాయి. ఇప్పటివరకు కూడా సిద్దూకి ఆ అమ్మాయి పేరు ఏంటో తెలియదు.. బేబీ బేబీ అని పిలవడం తప్ప ఆమె వివరాలు ఏమీ అడగలేదు కానీ ఆమె అడిగిందల్లా మాత్రం కొనిచ్చాడు. సంవత్సరం తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి సిద్దుకి ఫోన్ చేసి నేను ఊరికి వస్తున్నాను నువ్వు రైల్వేస్టేషన్ కి రా మనమిద్దరం కలుద్దాం అని చెప్పడంతో ఎగిరి గంతేసినంతపని చేసి ఇంట్లో ఉన్న తన డ్రెస్సులన్నీ తిర్లేసి మర్లేసి మంచి డ్రెస్ వేసుకొని బాగా తయారయ్యి తల్లికి విషయం చెప్పి తల్లి దగ్గరే డబ్బులు తీసుకుని రైల్వేస్టేషన్ కి వెళ్ళాడు.

రైల్వే స్టేషన్లో అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ సిద్దూకి అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు అలాగే సిద్దూ ఎలా ఉంటాడో ఆ అమ్మాయికి కూడా తెలియదు కానీ ఫోన్ నెంబర్ తెలుసు కాబట్టి ఫోన్ పట్టుకొని రైల్వేస్టేషన్ లో కూర్చొని వచ్చే, పోయే రైలుని రైలు చూస్తూ ఉన్నాడు. ఏ ట్రైన్ లో నుంచి అమ్మాయి దిగుతుందో అని ఎదురు చూస్తూ అలాగే కూర్చుని ఉన్నాడు. అలా పొద్దన్నుంచీ, సాయంత్రం వరకూ ఎన్నో రైళ్లు వచ్చాయి ఎన్నో రైలు పోయాయి కానీ ఆ అమ్మాయి జాడ మాత్రం లేదు.

ఎన్నోసార్లు ఫోన్ కూడా చేశాడు కానీ సిగ్నల్ సరిగా ఉండవు కాబట్టి అక్కడినుండే ఫోన్ వస్తుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం అయినా కూడా ఆ అమ్మాయి రాకపోయేసరికి ఫోన్ల మీద ఫోన్లో చేస్తూనే ఉన్నాడు కాసేపటికి ఫోన్ రింగ్ అయింది ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో బేబీ ఏంటి నేను ఇక్కడ పొద్దున్నుంచి ఎదురు చూస్తున్న నీకోసం ఇంకా రాలేదేంటి అంటూ ఆత్రంగా అడిగాడు సిద్ధూ….

రేయ్ ఎవడ్రా నువ్వు? నా నెంబర్ కి ఫోన్ చేసి బేబీ అంటున్నావ్ అంటూ ఒక పెద్దావిడ గొంతు వినిపించేసరికి ఏమండీ మా బేబీ అంటూ అడిగాడు. బేబీ ఆ ఇది లేడీస్ హాస్టల్ ఫోన్…. ఇక్కడ ఎవరెవరో ఎవరెవరికో ఫోన్స్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ రిలేటివ్స్ కి ఫోన్ చేస్తారు. ఇన్నాళ్లు నేను సెలవులో ఉన్నాను కాబట్టి ఎవరు ఫోన్ చేశారో నాకు తెలియదు. ఇంకోసారి ఇలా ఫోన్ చేసావంటే పోలీసులకు పట్టిస్తాను అంటూ టక్కున ఫోన్ పెట్టేశారు ఆవిడ.

ఆ మాటలు వినడంతో సిద్దు మైండ్ మొత్తం ఒక్కసారిగా స్థంభించిపోయింది తాను ఏమంటున్నాడు అసలు అనేది అర్థం కాలేదు. అయితే ఇన్నాళ్లు తనతో మాట్లాడింది ఎవరో తెలియని అమ్మాయా తన దగ్గర గిఫ్టులంటూ డబ్బులు అంటూ ఎన్నో తీసుకుంది. దాదాపు పదహారు లక్షల వరకు తాను తనకి ఇచ్చాడు తను తిరిగి ఇస్తాను అని నమ్మకంతో చెప్పడం వల్లే ఇచ్చాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్లాలి ఆ అమ్మాయిని తీసుకొని వస్తా లేదా కలిసి వస్తా అని అమ్మకు చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలాగే దిక్కుతోచని స్థితిలో అక్కడే కూలబడిపోయాడు సిద్దూ.

ఇప్పుడు సిద్దూ ఆత్మహత్య చేసుకుంటాడా లేదా అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్లి అందరికీ క్షమాపణ చెప్పి తిరిగి తన చదువులో మునిగి మంచి ఉద్యోగం సంపాదిస్తాడా అనేది కాలమే, లేదా అతను మాత్రమే నిర్ణయించాలి. ఇది నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ రాగానే వాళ్లని నమ్మి మోసపోకూడదు అది అబ్బాయిలైనా అమ్మాయిలు అయినా అని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి కనీస విచక్షణ జ్ఞానం ఉండాలి ఉండగలగాలి.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *