మేలుకున్న జనం
మేలుకున్నవి కొన్ని మేలుకోవాల్సినవి ఇంకొన్ని!
సమాజంలో మేలుకోవాల్సింది తప్పనిసరి అప్పుడే సమాజం మార్పు!
చిక్కుల చిక్కుళ్ళ నుంచి
అంతం లేని అరాచకాల నుండి
అధికమించిన అన్యాయాలనుండి
ఆదమరిచిన బాధ్యతల నుండి
కుల మతాల కుమ్ములాటల నుండి
సమసి పోనీ సమస్యల నుండి
సమాచార వ్యవస్థ అపశబ్దాల నుండి
ప్రకృతి అందించే పాఠాల నుండి
వివేకం నశించిన పౌరుల నుండి
కట్టుబడని వాగ్దానాల నుండి
రాజకీయాల ఎత్తుగడలనుండి
బలహీన ఆలోచనల నుండి
అజ్ఞానాందకారాల నుండి
సంఘంలోని అశాంతి నుండి
అభివృద్ధి ఆటంకాల నుండి
మనవత్వం లేని మనుషుల నుండి
చీకటి మాటున వెలుగుని
వెలికి తీసి
రేపటి పౌరులకుభవిష్యత్తు
నిరంతర నీరాజనమై వెలగడానికి మేలుకొనక తప్పదు జనం
సుపరిపాలన సూత్రం అయ్యేంతవరకు మరి….?
– జి జయ