మేలుకున్న జనం
మేలుకున్న జనం..?
ఇదొక ప్రశ్న.. ఇప్పటికీ ఎప్పటికీ..
ఎందుకంటే… ఎన్నో ఉదయాలు..
మరెన్నో అస్తమయాలు..
జరుగుతున్నప్పటికీ…
జనాలు మెలుకుంటారు.. అనేది ప్రశ్నే…
ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.. ఎన్నెన్నో మోసాలు జరుగుతున్నాయి…
అయినప్పటికీ…. మోసాలు, దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకీ…
ఎందుకు..?
అది ఎందుకు అని జనం మెలుకుంటే తెలుసుకుంటే..
నిన్న జరిగిన దారుణానికి.. నేడు జరగబోయే ఇంకో దారుణాన్ని ఆపగలిగే వాళ్ళం కదా…
నిన్న మోసపోయిన వారిని చూసి అయినా… నేడు మనం మోసపోకుండా ఉండాలి కదా…
లేదు అలాంటివి జరుగుతున్నాయి…
వీటిని ఆపెద్దాం అరికడదం అంటారు.. జరిగిన క్షణం..
మరుక్షణం ఏమి జరగనట్టు..
అసలేమీ పట్టనట్టు ఉంటారు..
భూమ్మీద ఇన్ని భూదేవి మోయలేని అన్ని పాపాలూ పెరుగుతుంటే..
ఈ జనాలు ఇంకెప్పుడు మేలుకుంటారు…
గొర్రెల మందలా రాజకీయ నాయకులకు నోటుకి ఓటు వేసి బానిసలు అవుతునే ఉంటారు..
మారారు మార్పు తేవాలి అని చూసే వారిని వెర్రి వాళ్ళని చేస్తుంది… ఈ లోకం..
మేలుకోండి.. మారండి… జరిగినవి చాలు..
జరగబోయే వాటిని ఆపండి..
– వనీత రెడ్డీ