కణము ఘనము!!

కణము ఘనము!!

కణముగా గర్భం చేరితివి.
ఏడుంటివో……….?
ఎట్లుంటివో……….?
నీకే తెలియని
స్థితి నీది…………….!

చింతలుండెటివేమో….?
ఒకవేళ, చేరువన
లోకులు చేరిన…………!

అయినా తప్ప లేదు నీకు,
నలుగు నీ శరీరము
నలుపు తల్లిని నొప్పులతో!
నలుసుగా నరుడి వై
నేలబడితివి …………..!

లేదిక ఆలస్యము
మొదటి అడుగు తో
ప్రారంభము నీ కుదుపుల
జీవనయానము ………..!

అలలైన లోకుల లో
నిను ముందుకు నెట్టు వారు
బహుకొద్ది………………!
వెనుకకు లాగు వారు
బహు సమృద్ధి…………!

నీ దారి నీవే ఎంచుకో…..!
ఒడ్డున చేరి, ఒరిగిన
ఒడ్డెకును కదరా నీ కుదుపులు.

ఏడుంటివో ………..?
ఎట్లుంటివో …………….?
తెలిసెనిప్పుడు నీకు.
తెలియనట్లుగ నుండు,
చేరక లోకుల చేరువ.

నీ గొప్ప,
వారికి గబ్బు……………!
నీ లావు వారికి
కణము మాదిరిగనే……!

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *