డైరీ
ఆ.వె.
1) నిద్ర లేచి తిరిగి నిద్రించు దినములో
చేసినట్టి పనులు చెదరకుండ
దినదినమున రాయు దీర్ఘమైపోకుండ
చేయు కార్యము దినచర్య “డైరి”
ఆ.వె.
2) సమయము సరిపోక సతమతమవుతుంటె
పొదుపుగా నడిపెడి పాదుడైరి
ఆనవాళ్ళు దెలుపు ఆయవ్యయమ్ముల
పనులు అన్ని సర్దుబాటు “డైరి”
– కోట