జీవితమంటే
చావు పుట్టుకల మధ్య చిన్న ప్రయాణమే జీవితమంటే
కరిగే కాలంలో తిరుగుతూ ఏదో ఒక రోజు కనుమరుగైపోవడమే జీవితం
గతం గురించి ఆలోచన మాని భవిష్యత్తే భరోసాగా నిర్ణయించుకుంటే సరైన జీవితం
ఆనందాలను వెతికి పట్టి అంతులేని చింతలను అణచిపెట్టి అవకాశాలను దక్కించుకోవడమే జీవితం
అందని దానికోసం ఆరాటపడడం అందిన దాన్ని వదులుకోకపోవడమే జీవితం
అన్ని సాధ్యమని అనుకోకుండా సందిగ్దావస్థలో గడపకుండా
సరైన మార్గం ఎంచుకోవడమే జీవితం
సముచిత ఆలోచనలతో సమకాలీన దృక్పథంతో మనల్నిసరిదిద్దుకోవడమే
జీవితం
కష్టసుఖాల సంగ్రామంలో
సంకల్ప బలంతో సాఫల్యం పొందడమే జీవితం
సమాజాన్ని చూసి స్థానాన్ని బట్టి సమయపాలన పాటిస్తూ సాటివారిని గౌరవిస్తూ బ్రతకడమే జీవితం
సంపాదన మార్గమే కాని
సంఘర్షణ లేకుండా సర్దుబాటు చేసుకోవడమే జీవితం
కోరికలు చిట్టాలు విప్పినా నిరుత్సాహం నీ దరిచేరకుండా సంతృప్తిగా జీవించడమే
అసలు సిసలైన జీవితం…..
_ జి జయ