జీవన ప్రయాణము
నీవు
మోయు సుఖాలు
ఉప్పు మూటలాయె.
వాటిని దించిన
తేలికౌను నీ
జీవన ప్రయాణము.
బరువులెత్తిన
కష్టజీవి కళ్ళు
నిదుర పుచ్చును వాడిని.
నీవు సముద్రాన్ని తోడగా
వొచ్చు ఉప్పటి
స్వేదము తిరిగి
దానికే వూటౌను
కదరా…………………!
కష్టించిన నిదురవొచ్చు
మరి నీకేల దుఃఖము రా….!
– వాసు