విన్యాసములు ఎన్నో
తోడు, కోర పింఛము విప్పి
నెమలి చేయు విన్యాసము
కర్ర పట్టుకు తీగపై విన్యాసము
చేయు కొందరు పొట్ట చేత పట్టుకు
అందాలనొలక పోసి విన్యాసము
చేయు ర్యాంపుపై యువతులు
ప్రపంచ సుందరి కిరీటం
తలపై దాల్చ ఆరాటంతో
తన హొయలు ఒలకపోసి
విన్యాసము చేయు విటునికై వేశ్య
తెచ్చి పెట్టు కొన్న చిరునవ్వు
ముఖముపై పులుముకొని
జుట్టు సర్దుకొని అద్దములో
ముఖము చూసుకొని
తన అందమునకు మురిసి పోయి
విన్యాసము చేయు నొక ప్రేమికుడు
తన వాలు చూపులతో
విన్యాసము చేయు ప్రియురాలు
తన మనో భావం తెల్ప
ప్రియుని దృష్టిలోపడ
– రమణ బొమ్మకంటి